రేపు టీటీడీ బోర్డు మీటింగ్.. పలు కీలక అంశాలపై చర్చ

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ సమావేశం లో పలు కీలక అంశాలపై చర్చించనుంది. బోర్డు మీటింగ్‌ను వర్చువల్‌గానే నిర్వహించాలని బోర్డు సభ్యులు...

రేపు టీటీడీ బోర్డు మీటింగ్.. పలు కీలక అంశాలపై చర్చ
Follow us

|

Updated on: Aug 27, 2020 | 4:19 PM

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశం శుక్రవారం జరుగనుంది. ఈ సమావేశం లో పలు కీలక అంశాలపై చర్చించనుంది. బోర్డు మీటింగ్‌ను వర్చువల్‌గానే నిర్వహించాలని బోర్డు సభ్యులు నిర్ణయిచారు. ఈ సమావేశంలో ఆర్థిక పరిస్థితిపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఐదునెలల్లో వచ్చిన ఆర్థిక నష్టాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో.. ఉద్యోగుల జీతాల కోసం బ్యాంకుల్లో ఉన్న టీటీడీ కార్పస్ ఫండ్ నుంచి డబ్బులు డ్రాచేసే అంశంపై బోర్డ్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.

భక్తుల సంఖ్యను తగించడంతో హుండీ ఆదాయం భారీగా తగ్గినందున గతంలో రోజుకి మూడు కోట్ల వచ్చే హుండీ ఆదాయం ఇప్పుడు కేవలం 40లక్షలు మాత్రమే వస్తోంది. ఉద్యోగుల జీతాలు, నిర్వహణకు 180 కోట్లు ఖర్చు చేస్తున్న టీటీడీ బ్రహ్మోత్సవాల నిర్వహణ అంశంను కూడా బోర్డు మీటింగ్‌లో చర్చించనున్నారు. ఏకాంతంగా సేవలు నిర్వహించాలా లేక స్వామి వారికి వాహన సేవ నిర్వహించాలా అనేదానిపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అయితే తిరుమల కొండపై కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో భక్తుల సంఖ్యను పెంచే అంశంపైనా కూడా సమావేశంలో చర్చిస్తారు.