శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం వెంకటేశ్వ‌రస్వామి భక్తులకు తిరుమ‌ల‌ తిరుప‌తి దేవ‌స్థానం మరో శుభవార్త చెప్పింది. పెద్ద లడ్డూ ధర భారీగా తగ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పటివరకూ శ్రీవారి పెద్ద లడ్డూను రూ.200లకు విక్రయిస్తుండ‌గా…. తాజాగా రూ.100 తగ్గించారు. ఇకపై ఈ లడ్డూను రూ.100కే భక్తుల‌కు అందిచ‌నున్న‌ట్లు టీటీడీ పేర్కొంది. కాగా ఇటీవ‌లే చిన్న లడ్డూ ధరను రూ.50 నుంచి రూ.25కి త‌గ్గించారు. స్వామివారి మ‌రో ప్ర‌సాదం వడ మాత్రం ఎప్ప‌టిధ‌ర‌కే విక్ర‌యించ‌నున్న‌ట్లు టీటీడీ అధికారులు తెలిపారు. క‌రోనా […]

  • Ram Naramaneni
  • Publish Date - 6:38 am, Fri, 22 May 20
శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం వెంకటేశ్వ‌రస్వామి భక్తులకు తిరుమ‌ల‌ తిరుప‌తి దేవ‌స్థానం మరో శుభవార్త చెప్పింది. పెద్ద లడ్డూ ధర భారీగా తగ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇప్పటివరకూ శ్రీవారి పెద్ద లడ్డూను రూ.200లకు విక్రయిస్తుండ‌గా…. తాజాగా రూ.100 తగ్గించారు. ఇకపై ఈ లడ్డూను రూ.100కే భక్తుల‌కు అందిచ‌నున్న‌ట్లు టీటీడీ పేర్కొంది. కాగా ఇటీవ‌లే చిన్న లడ్డూ ధరను రూ.50 నుంచి రూ.25కి త‌గ్గించారు. స్వామివారి మ‌రో ప్ర‌సాదం వడ మాత్రం ఎప్ప‌టిధ‌ర‌కే విక్ర‌యించ‌నున్న‌ట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా విధించిన‌ లాక్‌డౌన్ వ‌ల్ల‌ తిరుమలలో రెండు నెలలుగా దర్శనాలు లేకపోయినా వేంక‌టేశ్వ‌రుని హుండీ ఆదాయం మాత్రం తగ్గలేదు. రెండు నెల్లలో రూ.1.98 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్ల‌డించారు. ఎక్కువ‌ మొత్తం ఆన్‌లైన్ ద్వారానే వచ్చిందని వివ‌రిచారు. ఇ-హుండీ ఆదాయం రూ.1.79 కోట్లు వచ్చిందని ఆయన వెల్లడించారు. లాక్‌డౌన్‌తో టీటీడీ భక్తులకు దర్శనం రద్దు చేసినా.. లడ్డూ ప్రసాదాల వితరణ మాత్రం జ‌రుగుతూనేఉంది.

ప్ర‌స్తుతం శ్రీవారి టెంపుల్ లోకి భక్తులను అనుమతించే విషయంపై స‌స్పెన్స్ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించిన కేంద్ర ప్ర‌భుత్వం..భారీ సడలింపులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆలయాల్లో దర్శనాలను కూడా అనుమతిస్తారని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అన్ని దేవాలయాలు భ‌క్తులు భౌతిక దూరం పాటిస్తూ దైవ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. అయితే మే 31 వరకు అన్ని ఆలయాలను మూసివేయాలని కేంద్రం తేల్చి చెప్ప‌డంతో.. శ్రీవారి దర్శనం చేసుకోవడానికి మ‌రికొంత‌కాలం వెయిట్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.