తెలంగాణలో కౌంటింగ్‌కు రెడీ..!

తెలంగాణ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. 31 జిల్లాల్లోని 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్లు 37 ప్రాంతాల్లో 123 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. రేపు జరగబోయే ఓట్ల లెక్కింపునకు సంబంధించి 13 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలతో పాటు 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈటీపీబీఎస్‌, పోస్టల్‌ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుందని వివరించారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు […]

  • Tv9 Telugu
  • Publish Date - 1:16 pm, Wed, 22 May 19
తెలంగాణలో కౌంటింగ్‌కు రెడీ..!

తెలంగాణ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. 31 జిల్లాల్లోని 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఈవీఎంలు, వీవీప్యాట్లు 37 ప్రాంతాల్లో 123 స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. రేపు జరగబోయే ఓట్ల లెక్కింపునకు సంబంధించి 13 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలతో పాటు 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఈటీపీబీఎస్‌, పోస్టల్‌ బ్యాలెట్ల తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుందని వివరించారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. నిజామాబాద్‌ పరిధిలోని ప్రతి అసెంబ్లీ స్థానంలో 2 హాళ్లు, 36 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఓట్ల లెక్కింపులో జాగ్రత్తగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు.

వీవీ ప్యాట్‌ స్లిప్పుల రీకౌంటింగ్‌ కోసం అభ్యర్థి ఆర్వోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫలితాల వెల్లడిలో ఆర్వోదే తుదినిర్ణయమని, ఈసీ జోక్యం చేసుకోదని రజత్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఈవీఎం, వీవీప్యాట్‌ ఓట్లలో తేడా రాలేదని, వీవీ ప్యాట్‌లో మాక్‌ పోలింగ్ స్లిప్పులు క్లియర్‌ చేయకపోతేనే తేడా వస్తుందన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపులో మానవతప్పిదం జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో మీడియా సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు రజత్‌కుమార్‌ తెలిపారు.

ఇక ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సెంటర్లకు 100 మీటర్ల దూరంలో జన సంచారం, వాహనాల అనుమతిపై నిషేదాజ్ఞలు విధించారు. ఫలితాల వెల్లడి తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి తప్పనిసరి అని చెప్పారు. అనుమతి తీసుకుంటేనే భద్రత కల్పిస్తామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ జితేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రత వ్యవహారాల్ని పర్యవేక్షించేందుకు ఇన్‌ఛార్జ్‌గా డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు.