AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జైట్లీతో పీయూష్ ఢీ.. ఆర్ధిక శాఖ ఎవరిది.?

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్ని మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కాబోతున్నాడని స్పష్టం చేయడంతో గెలుపు ధీమాతో ఉన్న బీజేపీ.. మంత్రివర్గంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కీలకమైన ఆర్ధిక శాఖను ఈసారి ఎవరికి కేటాయిస్తారన్నది పార్టీ వర్గాల్లో  చర్చనీయాంశం అయింది. ఇటీవల జైట్లీ స్థానంలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయూష్‌కు ఆర్ధిక శాఖ ఇస్తారని కొంతమంది పార్టీ నేతలంటున్నారు. ఇకపోతే మోదీ కేబినేట్‌లో సీనియర్ అయిన అరుణ్ జైట్లీ గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. కానీ […]

జైట్లీతో పీయూష్ ఢీ.. ఆర్ధిక శాఖ ఎవరిది.?
Ravi Kiran
|

Updated on: May 22, 2019 | 1:49 PM

Share

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అన్ని మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కాబోతున్నాడని స్పష్టం చేయడంతో గెలుపు ధీమాతో ఉన్న బీజేపీ.. మంత్రివర్గంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కీలకమైన ఆర్ధిక శాఖను ఈసారి ఎవరికి కేటాయిస్తారన్నది పార్టీ వర్గాల్లో  చర్చనీయాంశం అయింది. ఇటీవల జైట్లీ స్థానంలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయూష్‌కు ఆర్ధిక శాఖ ఇస్తారని కొంతమంది పార్టీ నేతలంటున్నారు.

ఇకపోతే మోదీ కేబినేట్‌లో సీనియర్ అయిన అరుణ్ జైట్లీ గతంలో ఆర్ధిక మంత్రిగా ఉన్నారు. కానీ ఆయనకు ఇటీవల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన సమయంలో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ఆయన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు. దీనితో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చిన పక్షంలో ఆర్ధిక మంత్రి పదవి విషయంలో జైట్లీ – పీయూష్ మధ్య పోటీ నెలకొనే సూచనలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా పార్టీ పెద్దలు మాత్రం ఈసారి కూడా అరుణ్ జైట్లీకే ఆర్ధిక శాఖ ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఆరోగ్యం దృష్ట్యా  పీయూష్‌ వైపు కూడాకొందరు మొగ్గు చూపుతున్నారు. 2018లో ఆర్థిక వృద్ధి రేటు 6.6శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. అటు పెరుగుతున్న ఇంధన ధరలు ఆర్థిక వ్యవస్థకు సవాల్ గా మారాయి. ఇలాంటి సమయంలో ఆర్ధిక మంత్రిగా వీరిద్దరిలో ఎవరు బాధ్యతలను నిర్వర్తిస్తారో వేచి చూడాలి.

హీరో నారా రోహిత్ పెళ్లిలో ఇంత జరిగిందా? వెడ్డింగ్ వీడియో వైరల్
హీరో నారా రోహిత్ పెళ్లిలో ఇంత జరిగిందా? వెడ్డింగ్ వీడియో వైరల్
వైట్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్.. అందాలతో గత్తర లేపుతున్న రకుల్..
వైట్ డ్రెస్‌లో క్యూట్ లుక్స్.. అందాలతో గత్తర లేపుతున్న రకుల్..
రిపబ్లిక్ డే స్పెషల్.. మీపిల్లల కోసం అదిరిపోయే టిఫిన్ ఐడియాస్ ఇవే
రిపబ్లిక్ డే స్పెషల్.. మీపిల్లల కోసం అదిరిపోయే టిఫిన్ ఐడియాస్ ఇవే
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఇకపై అన్నింటికీ ఒకే కార్డు.. డెబిట్, క్రెడిట్ అన్నింటికీ ఒక్కటే
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
ఒక్క రోజులోనే ధురంధర్ రికార్డ్ బ్రేక్ చేసిన సినిమా..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
కోపాన్ని దాచుకోవడం ఇంత ప్రమాదకరమా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు..
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
వివాహం తర్వాత ఆధార్ కార్డులో భర్త పేరును ఎలా జోడించాలి?
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
కేతువు ఎఫెక్ట్.. ఈ రాశుల వారి జీవితంలో కొత్త మలుపే!
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
ఇది ఏం అదృష్టం సామీ.. ఈ రాశులకు కోరిన కొర్కెలు తీర్చుకునే సమయంఇదే
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!
రూ.18 వేల ఇన్వెస్ట్‌మెంట్‌తో రూ.2.5 కోట్ల లాభం..!