AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెస్ట్రన్ టాయిలెట్ vs ఇండియన్ టాయిలెట్: ఆరోగ్య పరంగా ఏది మంచిది? వైద్య నిపుణులు ఏమంటున్నారు?

నేటి ఆధునిక జీవనశైలిలో మన ఇళ్లలో ఇండియన్ టాయిలెట్ల కంటే వెస్ట్రన్ టాయిలెట్ల వాడకం బాగా పెరిగిపోయింది. కూర్చోవడానికి సౌకర్యంగా ఉండటం, చూడటానికి ఆధునికంగా కనిపించడమే దీనికి ప్రధాన కారణం. అయితే, సౌకర్యం ఒకెత్తయితే శారీరక ఆరోగ్యం మరొకెత్తు. ఆరోగ్య నిపుణులు, వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండింటిలో ఏది మన శరీరానికి ఎక్కువ ప్రయోజనకరమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వెస్ట్రన్ టాయిలెట్ vs ఇండియన్ టాయిలెట్: ఆరోగ్య పరంగా ఏది మంచిది? వైద్య నిపుణులు ఏమంటున్నారు?
Western Toilet Vs Indian ToiletImage Credit source: tv9 telugu
Jyothi Gadda
|

Updated on: Jul 31, 2026 | 10:58 AM

Share

చాలా మంది భారతీయ ఇళ్లలో ఇప్పుడు ప్రజలు వెస్ట్రన్ టాయిలెట్లను వాడుతున్నారు. అద్దె ఇళ్లలో నివసించేవారు కూడా వేరే ఇళ్లకు మారినప్పుడు, వెస్ట్రన్ టాయిలెట్లు ఉన్న ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తారు. వెస్ట్రన్ టాయిలెట్లను వాడటంలో ప్రతికూలతలు ఉన్నాయని, భారతీయ టాయిలెట్లే ఉత్తమమైనవని కొందరు వాదిస్తారు. ఈ విషయంపై వైద్యుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసా..? వెస్ట్రన్ టాయిలెట్ల వాడకం విపరీతంగా పెరిగినప్పటికీ, ఆరోగ్య పరంగా ఇండియన్ శైలి టాయిలెట్లే అత్యుత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇండియన్ టాయిలెట్ ప్రయోజనాలు:

మెరుగైన జీర్ణక్రియ, సులువైన మలవిసర్జన: ఇండియన్ టాయిలెట్‌లో మనం కూర్చునే విధానాన్ని స్క్వాటింగ్ పొజిషన్ అంటారు. ఈ భంగిమలో కూర్చున్నప్పుడు రెక్టమ్ నేరుగా తెరుచుకుని, పొత్తికడుపుపై సహజమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల ఎక్కువ ఆయాసం పడకుండా మలవిసర్జన ఈజీ అవుతుంది.

వ్యాధుల నివారణ: క్రమం తప్పకుండా ఇండియన్ టాయిలెట్ వాడటం వల్ల మలబద్ధకం, పైల్స్, ఎసిడిటీ, అపెండిసైటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

వ్యాయామం, కండరాల బలం: ఈ పద్ధతిలో కూర్చోవడం వల్ల కాళ్లు, తొడలు, తుంటి కండరాలు బలపడతాయి. అంతేకాకుండా ఇది పొత్తికడుపు భాగంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఇన్ఫెక్షన్ల భయం ఉండదు: ఇందులో మన శరీరం టాయిలెట్ సీట్‌ను నేరుగా తాకదు కాబట్టి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ లేదా చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వ్యాపించే అవకాశం ఉండదు.

వెస్ట్రన్ టాయిలెట్ ప్రయోజనాలు, పరిమితులు:

సౌకర్యం: వయోవృద్ధులు, గర్భిణులు, మోకాళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ లేదా శారీరక వైకల్యం ఉన్నవారికి వెస్ట్రన్ టాయిలెట్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.

ఆరోగ్యపరమైన లోపాలు: ఇందులో మనం కుర్చీలో కూర్చున్నట్లు 90 డిగ్రీల కోణంలో కూర్చుంటాం. ఈ భంగిమలో రెక్టమ్ కండరం సరిగ్గా సడలదు, దీనివల్ల మలవిసర్జనకు ఎక్కువ ఒత్తిడి ఉపయోగించాల్సి వస్తుంది. ఫలితంగా మలబద్ధకం హెచ్చవుతుంది.

ఇన్ఫెక్షన్ల ప్రమాదం: పబ్లిక్ ప్రదేశాల్లో వెస్ట్రన్ టాయిలెట్ సీట్ ద్వారా ఇన్ఫెక్షన్లు ఒకరి నుండి మరొకరికి వ్యాపించే అవకాశం ఎక్కువ.

కీళ్ల నొప్పులు లేదా ప్రత్యేక అనారోగ్య సమస్యలు లేనివారు నిత్యం ఇండియన్ టాయిలెట్ వాడటమే ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఒకవేళ వెస్ట్రన్ టాయిలెట్ ఉపయోగించాల్సి వస్తే, కాళ్ల కింద ఒక చిన్న స్టూల్ పెట్టుకుని కూర్చోవడం వల్ల పాక్షికంగా స్క్వాటింగ్ ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us