ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం

ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రైతులు, కూలీలు, జీవాల కాపర్లు చెట్లకింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించింది.

ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 11, 2020 | 6:22 PM

ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రైతులు, కూలీలు, జీవాల కాపర్లు చెట్లకింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించింది. ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖ జిల్లాలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది.

రంపచోడవరం, అడ్డతీగల, గంగవరం, ఏలేశ్వరం, జగ్గంపేట, దేవీపట్నం, మారేడుమిల్లి, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, చింతలపూడి, అరకులోయ, అనంతగిరి, జి.మాడుగుల, చింతపల్లె, రావికమతం, రోలుగుంట, గొలుగొండ, కొయ్యూరు మండలాల్లో పిడుగులు పడే ఛాన్స్ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Also Read :

అభిమాని ఆకస్మిక మరణం.. గుండె పగిలింది అంటూ మహేష్ ట్వీట్

రోజూ గోమూత్రం తాగుతా : అక్షయ్ కుమార్