Mobile Mistakes: మీరు చేసే ఈ తప్పులు ఫోన్‌కు స్లో పాయిజన్‌ లాంటివి.. మొబైల్‌ను నాశనం చేస్తాయి!

Mobile Mistakes: స్మార్ట్‌ఫోన్‌ వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని పొరపాట్ల వల్ల ఫోన్‌ పాడయ్యే అవకాశం ఉంది. బ్యాటరీ విషయంలో, యాప్స్‌ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ పొరపాట్ల వల్ల మొబైల్‌ స్లో కావడమే కాకుండా బ్యాటరీ లైఫ్‌ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది..

Mobile Mistakes: మీరు చేసే ఈ తప్పులు ఫోన్‌కు స్లో పాయిజన్‌ లాంటివి.. మొబైల్‌ను నాశనం చేస్తాయి!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 16, 2024 | 2:34 PM

స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు చేసే చిన్న పొరపాటు కూడా ఫోన్‌ను దెబ్బతీస్తుంది. మీరు కూడా ఫోన్ ఏళ్ల తరబడి ఎలాంటి సమస్య లేకుండా పని చేస్తూనే ఉండాలంటే, మొబైల్ వాడేటప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. చిన్న పొరపాటు స్లో పాయిజన్‌గా పనిచేసి క్రమంగా ఫోన్‌ని పాడు చేస్తుంది. కొన్ని అలవాట్లు క్రమంగా మన స్మార్ట్‌ఫోన్‌కు విషంలా పనిచేస్తాయి. ఈ అలవాట్లు మీ ఫోన్ పనితీరును మందగించడమే కాకుండా దాని జీవితకాలాన్ని కూడా తగ్గిస్తాయి.

ఈ తప్పులను నివారించండి: 

  1. పూర్తిగా డిశ్చార్జ్: ఫోన్ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయ్యే వరకు చాలా మంది ఫోన్‌ను ఛార్జ్‌ చేయరు. ఛార్జ్‌లో ఉంచుతారు. కానీ మీరు చేసిన ఈ పొరపాటు వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. అలా జరిగితే బ్యాటరీని మార్చాల్సిన అవసరం రావచ్చు.
  2. ఫోన్ వేడెక్కడం: ఫోన్‌లో టెంపరేచర్ పెరిగిపోతుంటే ఫోన్‌లో టెంపరేచర్ పెరగడానికి కారణమేమిటో తెలుసుకోవాలి? దీన్ని సరైన సమయంలో గుర్తించకపోతే ఫోన్ వేడెక్కడం వల్ల పేలిపోయే ప్రమాదం ఉంది.
  3. ఫోన్‌ని మళ్లీ మళ్లీ ఛార్జింగ్ చేయడం: ఫోన్‌లో బ్యాటరీ కాస్త తగ్గితే మళ్లీ మళ్లీ ఛార్జింగ్ పెట్టే అలవాటు మీకు ఉందా? అయితే మీరుఎ పొరపాటు చేస్తున్నట్లే. ఇలా చేసినా బ్యాటరీ లైఫ్ దెబ్బతింటుంది. లేకపోతే మీరు చేసే ఈ పొరపాటు బ్యాటరీపై ప్రభావం చూపుతుంది.
  4. చాలా యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం: మీకు కూడా చాలా యాప్‌లను ఇన్‌స్టాల్ చేసే అలవాటు ఉంటే, మీ అలవాటును సకాలంలో మార్చుకోండి. లేకపోతే మీ ఫోన్ పూర్తిగా నిండిపోతుంది. దీని కారణంగా మీ హ్యాండ్‌సెట్ వేగం తగ్గుతుంది.
  5. ఫోన్‌ను మురికిగా ఉంచడం: మీరు మీ గురించి జాగ్రత్తగా చూసుకున్న విధంగానే ఫోన్‌ను జాగ్రత్తగా చూసుకోకపోతే, ఫోన్ పాడైపోతుంది, ఇది మీకు నష్టాన్ని కూడా కలిగిస్తుంది. ఫోన్‌ను దుమ్ము, ధూళి నుండి రక్షించండి. లేకుంటే ఫోన్ స్క్రీన్, పోర్ట్‌లు పాడైపోవచ్చు. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు మీ ఫోన్ జీవితాన్ని పెంచుకోవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి