కర్నాటకలోని మాండ్యాలో ముగ్గురు పూజారుల హత్య
Thugs kill Three Priests : కర్నాటకలోని మాండ్యాలో ట్రిపుల్ మర్డర్ కలకలం సృష్టించింది. మాండ్యా శివార్లలోని గుట్టల్లో ఉన్న శ్రీ అరకేశ్వర దేవాలయంలో ముగ్గురు పూజారులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. మృతులను గణేష్, ప్రకాశ్, ఆనంద్‌గా గుర్తించారు. ఉదయం దేవాలయం ఆలయం తలుపులు తెరవగానే రక్తం మడుగులో పడి ఉన్న ముగ్గురి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. హంతకులు ఆలయంలోని మూడు హుండీల్లో ఉన్న కరెన్సీ నోట్లు తీసుకెళ్లిపోయారు. నాణేలు మాత్రం వదిలిపోయారు. చనిపోయిన […]
Thugs kill Three Priests : కర్నాటకలోని మాండ్యాలో ట్రిపుల్ మర్డర్ కలకలం సృష్టించింది. మాండ్యా శివార్లలోని గుట్టల్లో ఉన్న శ్రీ అరకేశ్వర దేవాలయంలో ముగ్గురు పూజారులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. మృతులను గణేష్, ప్రకాశ్, ఆనంద్‌గా గుర్తించారు.
ఉదయం దేవాలయం ఆలయం తలుపులు తెరవగానే రక్తం మడుగులో పడి ఉన్న ముగ్గురి మృతదేహాలను స్థానికులు గుర్తించారు. హంతకులు ఆలయంలోని మూడు హుండీల్లో ఉన్న కరెన్సీ నోట్లు తీసుకెళ్లిపోయారు. నాణేలు మాత్రం వదిలిపోయారు. చనిపోయిన ముగ్గురు దగ్గరి బంధువులని, కొన్నేళ్లుగా ఆలయంలో పూజారులుగా పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆలయానికి రక్షణగా వారు రోజు అక్కడే పడుకుంటారని చెప్పారు.
విషయం తెలుసుకున్న సదరన్ రేంజ్ ఐజీ విపుల్ కుమార్ మైసూర్ నుంచి హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. నిద్రలోనే వాళ్లను చంపేశారని, హంతకులతో ప్రతిఘటించినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు పోలీసులు. ముగ్గురికన్నా ఎక్కువ మందే ఈ దారుణంలో పాలుపంచుకున్నట్లు భావిస్తున్నారు.
హుండీల్లో డబ్బు ఎత్తుకెళ్లాలన్న లక్ష్యంతోనే ఈ హత్యలకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. హంతకులు పారిపోవడానికి ముందు దేవాలయంలో నగల కోసం వెతికినట్లు ఆధారాలు లభించాయి. నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. క్లూస్ టీమ్, పోలీసు జాగిలాల సాయంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు కర్నాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప.