‘అనకాపల్లి ఉద్యాన కేంద్రం కడపకి తరలించేందుకు కుట్ర’
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. మాజీ మ౦త్రి అయ్యన్న పాత్రుడు జగన్ సర్కారుపై వరుస విమర్శలకు దిగారు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా విమర్శలు ఎక్కుపెడుతున్న ఆయన....
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత.. మాజీ మ౦త్రి అయ్యన్న పాత్రుడు జగన్ సర్కారుపై వరుస విమర్శలకు దిగారు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా విమర్శలు ఎక్కుపెడుతున్న ఆయన.. మరోసారి వరుస ట్వీట్లతో వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఉద్యాన పరిశోధనా కేంద్రాన్ని కడపకి తరలించేందుకు జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా క్షేత్రంకి కేటాయించిన స్థలంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు తగదని ఆయన అన్నారు. మెడికల్ కాలేజీ కోసం ప్రత్యేకంగా భూమిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యల వల్ల ఉత్తరాంధ్ర మరింత వెనుకబడుతుందని అయ్యన్న మ౦డిపడ్డారు. రైతు ప్రభుత్వం అ౦టూ గొప్పలు చెప్పకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేయటం దారుణమని అయ్యన్న విమర్శించారు.