దక్షిణాఫ్రికా జట్టులో ముగ్గురు మహిళా క్రికెటర్లకు కరోనా..
కరోనా వైరస్ ప్రభావం క్రీడారంగంపై తీవ్రంగా పడింది. అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లు, దేశవాళీ టోర్నీలు అన్నీ కూడా వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే చాలామంది క్రికెటర్లు ఈ మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే.

Three COVID-19 cases as South Africa women Team: కరోనా వైరస్ ప్రభావం క్రీడారంగంపై తీవ్రంగా పడింది. అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లు, దేశవాళీ టోర్నీలు అన్నీ కూడా వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే చాలామంది క్రికెటర్లు ఈ మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా దక్షిణాఫ్రికా మహిళల జట్టులో ముగ్గురు క్రికెటర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఇక ఈ విషయంపై స్పందించిన క్రికెట్ దక్షిణాఫ్రికా.. పాజిటివ్ వచ్చిన ముగ్గురు మహిళా క్రికెటర్లు 10 రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉన్నారని.. డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. అంతేకాకుండా ఆ ముగ్గురు మహిళా క్రికెటర్లు శిక్షణా శిబిరానికి హాజరుకారని స్పష్టం చేసింది. కాగా, ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా మహిళల జట్టు కొద్దిరోజుల క్రితమే ప్రాక్టీస్ మొదలుపెట్టిన సంగతి విదితమే.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భూముల విలువ భారీగా పెంపు.!
కిమ్ ఇలాకాలో మొదటి కరోనా కేసు.. ఆ నగరంలో కఠిన లాక్‌డౌన్..!
