వామ్మో ఇదేందిరా బాబు.. పిల్లిని దువ్విన కుందేలు.. ఎందుకు ఇంతలా కాకా పట్టిందో తెలుసా..

వామ్మో ఇదేందిరా బాబు.. పిల్లిని దువ్విన కుందేలు.. ఎందుకు ఇంతలా కాకా పట్టిందో తెలుసా..
Rabbit Massage Cat

మసాజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.  మీరు ఏదో ఒక సమయంలో మసాజ్ చేయించుకుని ఉంటారు. ఇది శరీరానికి చాలా ఆహ్లాదాన్ని అందిస్తుంది.  సోషల్ మీడియాలో..

Sanjay Kasula

|

Dec 27, 2021 | 6:04 PM

Rabbit Massage Cat: మసాజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.  మీరు ఏదో ఒక సమయంలో మసాజ్ చేయించుకుని ఉంటారు. ఇది శరీరానికి చాలా ఆహ్లాదాన్ని అందిస్తుంది.  సోషల్ మీడియాలో  మీరు మసాజ్‌కి సంబంధించిన అనేక రకాల వీడియోలను చూసి ఉంటారు. అనేక రకాల మసాజ్‌లు ఉన్నాయి. ఇలాంటి వాటిలో అన్ని రకాల మసాజ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. మీరు మనుష్యులు మసాజ్ చేయించుకుంటున్న వీడియోలు చాలా చూసి ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా పిల్లి మసాజ్ చేయించుకోవడం చూశారా..? అవును, ఈ రోజు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక కుందేలు పిల్లికి మసాజ్ చేయడం చూడవచ్చు. ఇది చాలా ఫన్నీగా అనిపిస్తుంటుంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిల్లి నేలపై పడుకుని నిద్రిస్తున్నట్లుగా కనిపిస్తుంది. హాయిగా కూర్చోని కుందేలుతో దాని వీపుపై మసాజ్ చేయించుకుంటుంది. కుందేలు కూడా వేగంగా తన పని చేస్తుంది. అది పిల్లిని ఎందుకు అంతలా కాక పడుతోందో అర్థం కాదు. కాని అతడిని చూస్తుంటే పిల్లి వీపుకి మసాజ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.

ఒక వ్యక్తి వీపును ఇంత వేగంగా మసాజ్ చేయడం మీరు చాలా అరుదుగా చూసి ఉండరు. అదే సమయంలో, పిల్లి కూడా ఈ మసాజ్‌ని హాయిగా ఎంజాయ్ చేస్తోంది. కుందేలు గోళ్లు తన వీపుపై ఉన్నాయో లేదో ఆమె అస్సలు స్పందించదు.

ఈ ఫన్నీ వీడియో @buitengebieden_ పేరుతో ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 26 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే 2 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. అదే సమయంలో  చాలా మంది వీడియోను చూసి ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు.

ఇవి కూడా చదవండి: Teachers Protest: జూనియర్లకు పట్టం కడతారా.. ఆ జీవోను రద్దు చేయాల్సిందే.. రోడ్డెక్కిన ఉపాధ్యాయులు..

Year Ender 2021: మార్కెట్ల దూకుడు.. పెట్రో పరుగు.. భారతీయ యువతలో బిజినెస్ మూడ్.. ఈ ఏడాది ఇవే టాప్!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu