Google: గూగుల్ ఫెయిల్యూర్ స్టోరీ ఇది! ఎప్పుడూ విజయాలేనా? ఈ లిస్ట్ కూడా చూడండి..

సర్వసాధారణంగా మనం ఎక్కువగా ఓ వ్యక్తి లేదా సంస్థ సాధించిన విజయాల గురించే ఎక్కువ మాట్లాడతాం. అయితే ఆ విజయాల వెనుక పరాజయాల పరంపర కూడా ఉంటుంది. ఆ అపజయాలు నేర్పిన పాఠాలే విజయాలకు దారితీస్తాయి. అందుకో టెక్ దిగ్గజం గూగుల్ కూడా మినహాయింపు కాదు. గూగుల్ అనుబంధంగా అనేక యాప్స్ ఉన్నాయి. అవి బాగా ఉపయోగపడుతున్నాయి. అదే సమయంలో గూగుల్ నుంచి వచ్చిన చాలా ఉత్పత్తులు వినియోగదారులకు అంతగా ఉపయోగపడలేదు. దీంతో వాటిని గూగుల్ శాశ్వతంగా తొలగించాల్సిన వచ్చింది. 

Google: గూగుల్ ఫెయిల్యూర్ స్టోరీ ఇది! ఎప్పుడూ విజయాలేనా? ఈ లిస్ట్ కూడా చూడండి..
Google Search
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 27, 2023 | 10:00 PM

సర్వసాధారణంగా మనం ఎక్కువగా ఓ వ్యక్తి లేదా సంస్థ సాధించిన విజయాల గురించే ఎక్కువ మాట్లాడతాం. అయితే ఆ విజయాల వెనుక పరాజయాల పరంపర కూడా ఉంటుంది. ఆ అపజయాలు నేర్పిన పాఠాలే విజయాలకు దారితీస్తాయి. అందుకో టెక్ దిగ్గజం గూగుల్ కూడా మినహాయింపు కాదు. ప్రస్తుతం సెర్చ్ ఇంజిన్ గూగుల్ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదెమో. ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులు దీనిని వినియోగిస్తున్నారు. డెస్క్ టాప్, ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ అన్ని సాఫ్ట్ వేర్లలోనూ గూగుల్ ఎంచక్కా పనిచేస్తుంది. మనకు కావాల్సింది జస్ట్ టైప్ చేస్తే చాలు క్షణాల్లో డేటాను అందిస్తుంది. గూగుల్ అనుబంధంగా అనేక యాప్స్ ఉన్నాయి. ఈమెయిల్, మ్యాప్స్, డ్రైవ్ వంటి ఫీచర్లు చాలా ఉన్నాయి. ఇవన్నీ వినియోగదారుల మన్ననలు అందుకున్నాయి. అవి బాగా ఉపయోగపడుతున్నాయి. అదే సమయంలో గూగుల్ నుంచి వచ్చిన చాలా ఉత్పత్తులు వినియోగదారులకు అంతగా ఉపయోగపడలేదు. దీంతో వాటిని గూగుల్ శాశ్వతంగా తొలగించాల్సిన వచ్చింది. ఆ గూగుల్ ఫెయిల్డ్ యాప్స్ గురించి తెలుసుకుందాం రండి..

గూగుల్ గ్లాస్.. ఇది నోటిఫికేషన్‌లను ప్రదర్శిస్తుంది. ఫోటోలు, వీడియోలను కూడా తీయగలగుతుంది. వినియోగదారుల పరిసరాల గురించి నిజ-సమయ సమాచారాన్ని అందించగలుగుతంది. ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసి, వివిధ యాప్‌లు, సేవలను యాక్సెస్ చేయగలుగుతుంది. అయితే వినియోగదారుల నుంచి అంతగా స్పందనలేకపోవడంతో గూగుల్ దీనిని నిలిపివేసింది.

గూగుల్ వేవ్.. గూగుల్ డాక్స్ మాదిరిగానే డాక్యుమెంట్లను నిల్వ చేయడానికి, ఎడిట్ చేయడానికి వినియోగదారులకు ఇది అనుమతిస్తుంది. వినియోగదారులు డాక్యుమెంట్లలోని నిర్దిష్ట భాగాలపై కూడా కామెంట్ చేయొచ్చు. ఇతర వినియోగదారులు చేసిన మార్పులను చూడవచ్చు. దీనిని కూడా గూగుల్ తొలగించింది.

ఇవి కూడా చదవండి

గూగుల్ బజ్.. దీనిని 2010లో జీమెయిల్ సర్వీస్ కు అనుసంధానించిన ఓ సోషల్ నెట్‌వర్కింగ్ సేవ. ఇది వినియోగదారులు వారి పరిచయాలతో అప్‌డేట్‌లు, ఫొటోలు, వీడియోలు, ఇతర కంటెంట్‌ను షేర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. పోస్ట్‌లను కామెంట్ చేయడానికి, లైక్ లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.

గూగుల్ రీడర్.. ఇది 2005లో అందుబాటులోకి వచ్చింది. 2013లో నిలిపివేశారు. గూగుల్ రీడర్ అనేది న్యూస్ అగ్రిగేటర్, ఇది వినియోగదారులు ఒకే చోట వివిధ మూలాధారాల నుంచి వార్తలు, ఇతర కంటెంట్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోవడానికి, చదవడానికి అనుమతించింది.

గూగుల్ నెక్సస్.. గూగుల్ నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్ ఇది. నెక్సస్ వన్ పేరిట 2010లో దీనిని ప్రారంభించింది. ఈ నెక్సస్ సిరీస్ లో గూగుల్ నెక్సస్ 7 ట్యాబ్లెట్, నెక్సస్ 10 ట్యాబ్లెట్, నెక్సస్ ప్లేయర్ స్ట్రీమింగ్ మీడియా ప్లేయర్ వంటి పరికరాలను లాంచ్ చేసింది. అయితే 2016లో ఈ నెక్సస్ సిరీస్ ను పూర్తిగా నిలిపివేసి.. దాని స్థానంలో గూగుల్ పిక్సల్ ను తీసుకొచ్చింది.

గూగుల్ ప్లస్.. ఇది మొదట్లో వినియోగదారుల నుంచి సానుకూల స్పందనను అందుకుంది. కానీ గణనీయమైన కస్టమర్ బేస్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇతర సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంది. 2019లో, తక్కువ వినియోగం, వేలాది మంది వినియోగదారులు భద్రతా లోపాన్ని కనుగొన్నందున గూగుల్ ప్లస్ ని మూసివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఏప్రిల్ 2019లో గూగుల్ ప్లస్ ను అధికారికంగా మూసివేసింది.

గూగుల్ అల్లో.. గూగుల్ అసిస్టెంట్ మాదిరిగా ఇది పనిచేస్తుంది. వెబ్‌లో శోధించడం, రిమైండర్‌లను సెట్ చేయడం మొదలైనవాటికి సహాయపడే వర్చువల్ అసిస్టెంట్. యాప్‌లో “హిడెన్ మోడ్” అనే ఫీచర్ కూడా ఉంది. ఇది నిర్దిష్ట సమయం తర్వాత స్వయంచాలకంగా సందేశాలను పంపడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

గూగుల్ ఇన్ బాక్స్.. ఈ మొబైల్ యాప్ ఈ-మెయిల్ సర్వీస్ ను 2014లో ప్రారంభించి, 2019లో నిలిపివేసింది. గూగుల్ ఇన్ బాక్స్ అనే మొబైల్ అప్లికేషన్. గూగుల్ హ్యాంగ్ అవుట్స్ తో కలిసి వినియోగదారులకు మంచి సేవలను అందించింది.

గూగుల్ హ్యాంగ్ అవుట్స్.. ఇది డెస్క్‌టాప్, మొబైల్ పరికరాలలో అందుబాటులో ఉండేది. వినియోగదారులు దీన్ని వెబ్ ద్వారా లేదా ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ లలో ప్రత్యేక యాప్‌ల ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఇది వినియోగదారులకు సందేశాలను పంపడానికి, వాయిస్, వీడియో కాల్‌లు చేయడానికి, ఇతర వినియోగదారులతో ఫోటోలు, ఏదైనా పెద్ద ఫైల్‌లను భాగస్వామ్యం చేయడానికి అనుమతించింది.

గూగుల్ ప్లే మ్యూజిక్.. వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ ద్వారా లేదా వ్యక్తిగత ట్రాక్‌లు లేదా ఆల్బమ్‌లను కొనుగోలు చేయడం ద్వారా పాటలు, ఆల్బమ్‌లు, ప్లే లిస్ట్ లైబ్రరీని అందిస్తుంది. ఇది 50,000 పాటల వరకు అప్‌లోడ్ చేయగల, ప్రసారం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..