Parineeti Chopra-Raghav Chadha : భర్తపై ప్రేమను పాట రూపంలో చాటుకున్న పరిణీతి.. స్వయంగా ఆలపించి.. రికార్డింగ్ చేసి..

బాలీవుడ్ ప్రముఖ నటి పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఘనంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి కొందరు రాజకీయ నాయకులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం పరిణీతి- రాఘవ్‌ల పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి

Parineeti Chopra-Raghav Chadha : భర్తపై ప్రేమను పాట రూపంలో చాటుకున్న పరిణీతి.. స్వయంగా ఆలపించి.. రికార్డింగ్ చేసి..
Parineeti Chopra Wedding
Follow us
Basha Shek

|

Updated on: Sep 27, 2023 | 9:55 PM

బాలీవుడ్ ప్రముఖ నటి పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్‌లో ఘనంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు, అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి కొందరు రాజకీయ నాయకులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం పరిణీతి- రాఘవ్‌ల పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లి ఎంతో అట్టహాసంగా జరిగింది. సెప్టెంబర్ 25న ఈ జంట తమ పెళ్లి ఫోటోలను షేర్ చేయగా, పెళ్లికి సంబంధించిన మరిన్ని కథనాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.అలాగే పరిణీతి రొమాంటిక్ సాంగ్ కూడా వైరల్ అవుతోంది. తన భర్త కోసం పరిణీతే ఈ పాటను ప్రత్యేకంగా రికార్డ్‌ చేసిందట. ‘ఓ పియా’ అంటూ సాగే పాటను గౌరవ్ దత్తా సన్నీ MR, హర్జోత్ కౌర్‌లు రాశారు. ఒక క్లిప్‌లో, పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహంలో వర్మల వేడుకలో ఈ ప్రత్యేక పాట నేపథ్య సంగీతంగా ప్లే చేశారు. ఈ పాట ఇప్పుడు ప్రతి ఒక్కరూ వినడానికి యూట్యూబ్‌లో కూడా అందుబాటులో ఉంది. కాగా నివేదికల ప్రకారం, పరిణీతి చోప్రా- రాఘవ్ చద్దా త్వరలో రిసెప్షన్ పార్టీని ఏర్పాటు చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం ఆన్‌లైన్‌లో ఆహ్వానం వచ్చింది. సెప్టెంబర్ 30న చండీగఢ్‌లో రిసెప్షన్ పార్టీ ఏర్పాటుచేస్తున్నారట ఈ న్యూకపుల్‌. అలాగే అక్టోబర్ 4న ముంబైలో రిసెప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. దీనికి ముందు, కియారా అద్వానీ తన పెళ్లికి సరిగ్గా సరిపోయేలా మార్చడం ద్వారా ‘షేర్షా’ చిత్రంలోని ‘రంజా’ పాటను కూడా తన పెళ్లికి ఉపయోగించుకుంది.

సరస్సుల నగరంగా పేరొందిన ఉదయపూర్‌ వేదికగా పరిణీతి- రాఘవ్‌ పంజాబీ సంప్రదాయ పద్ధతిలో పెళ్లిపీటలెక్కారు.’డివైన్ ప్రామిస్-ఎ పర్ల్ వైట్ ఇండియన్ వెడ్డింగ్’ అనే థీమ్‌తో ఈ వివాహం జరిగింది. కాగా పరిణీతి- రాఘవ్‌ చద్దాల ఈ వివాహానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. అలాగే వివాహ వేడక అనంతరం నూతన దంపతుల ఫోటోను సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. కొత్తగా పెళ్లైన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి సందర్భంగా పరిణీతి చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్‌లో కనిపించింది. ఆమె ఐవరీ, గోల్డ్ షేడ్ లెహంగా ధరించింది. మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ డిజైనర్ లెహంగాలో పరి నిజంగా దేవకన్యలా కనిపించింది. విశేషమేమిటంటే ఈ లెహంగా తయారీకి దాదాపు 104 రోజులు పట్టిందట. ఆమె కండువాపై రాఘవ్ పేరు రాసి ఉంది. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. వరుడు, రాఘవ్ గురించి మాట్లాడుతూ, అతను తన మామ ఫ్యాషన్ డిజైనర్ పవన్ సచ్‌దేవా రూపొందించిన దుస్తులలో అందంగా కనిపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!