అభినందన్ పాక్ విమానాన్ని కూల్చిన విధానం సూపర్

న్యూఢిల్లీ: భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాక్ యుద్ధ విమానాలను తరిమి కొట్టడంలో అభినందన్ చేసిన పోరాటం అభినందనీయం. పాక్ విమానాలను తరిమేసిన తర్వాత అన్ని మన మిగతా విమానాలు తిరిగి వెనక్కి వచ్చేశాయి. కానీ అభినందన్‌కు మాత్రం పాక్ విమానంపై దాడి చేసేందుకు మన వాయిసేన పర్మిషన్ ఇచ్చింది. దీంతో అభినందన్ వీర విహారం చేశాడు. శత్రు విమానం ఎఫ్-16 ఎంతో శక్తివంతమైనది అయినప్పటికీ తన విన్యాసాలతో దాన్ని బురిడీ కొట్టించాడు. గాల్లో పలు విధాలుగా చక్కర్లు […]

  • Vijay K
  • Publish Date - 8:36 am, Fri, 8 March 19
అభినందన్ పాక్ విమానాన్ని కూల్చిన విధానం సూపర్

న్యూఢిల్లీ: భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాక్ యుద్ధ విమానాలను తరిమి కొట్టడంలో అభినందన్ చేసిన పోరాటం అభినందనీయం. పాక్ విమానాలను తరిమేసిన తర్వాత అన్ని మన మిగతా విమానాలు తిరిగి వెనక్కి వచ్చేశాయి. కానీ అభినందన్‌కు మాత్రం పాక్ విమానంపై దాడి చేసేందుకు మన వాయిసేన పర్మిషన్ ఇచ్చింది. దీంతో అభినందన్ వీర విహారం చేశాడు.

శత్రు విమానం ఎఫ్-16 ఎంతో శక్తివంతమైనది అయినప్పటికీ తన విన్యాసాలతో దాన్ని బురిడీ కొట్టించాడు. గాల్లో పలు విధాలుగా చక్కర్లు కొడుతూ దూసుకుపోయాడు. శత్రు విమానాన్ని క్లోజ్ రేంజ్‌లోకి తీసుకొచ్చిన తర్వాత అదును చూసి ఆర్-73 క్షిపణిని ప్రయోగించాడు. అంతే దెబ్బకు పాక్ విమానం కూలిపోయింది. అయితే ఈ లోపు కొన్ని పాక్ విమానాలు అభినందన్‌ను చుట్టు ముడుతుండటంతో అభినందన్ ప్లాన్ మార్చాడు.

అత్యంత ప్రమాదకరమైన ‘హై జీ బ్యారెల్ రోల్’ విన్యాసాలు చేశాడు. శుత్రు విమానాలు అత్యంత సమీపంలోకి వచ్చినప్పుడు చివరి ప్రయత్నంగా ఈ విధానాన్ని అనుసరిస్తారు. గాల్లో గింగరాలు తిరుగుతూ ఒక వైపుకు వాలిపోయనట్టుగా, పడిపోతున్నట్టుగా విన్యాసాలు చేస్తారు. అయినప్పటికీ అభినందన్ విమానం దాడికి గురికావడంతో విమానం నుంచి ప్యారాచూట్ సాయంతో అభినందన్ కిందకు దూకేయాల్సి వచ్చింది.