అభినందన్ చాకచక్యాన్ని మర్చిపోలేకపోతున్నాం: పాకిస్థానీ ప్రజలు

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని హోరాన్ గ్రామస్థులు అభినందన్ చూపించిన చాకచక్యాన్ని మర్చిపోలేకపోతున్నారు. దురదృష్టవశాత్తు పాక్ భూభాగంలో దిగాల్సి వచ్చిన అనంతరం అభినందన్ వ్యవహార శైలి, చూపించిన తెలివి అద్భుతం. అసలు ఏం జరిగిందనే విషయాన్ని అభినందన్ ప్యారాచూట్ సాయంతో దిగిన హోరాన్ గ్రమస్థులు చక్కగా చెబుతున్నారు. వారి మాటల్లోనే.. “ఆకాశంలో కొన్ని విమానాలు తిరుగుతూ పోరాటం చేస్తున్నట్టు గుర్తించాం. కొంత సేపటి తర్వాత ఒక విమానం మంటల్లో చిక్కుకోవడం కనిపించింది. అందులోనుంచి ఒకరు ప్యారాచూట్ సాయంతో కిందకు దిగాడు. […]

అభినందన్ చాకచక్యాన్ని మర్చిపోలేకపోతున్నాం: పాకిస్థానీ ప్రజలు
Follow us

|

Updated on: Mar 08, 2019 | 10:15 AM

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని హోరాన్ గ్రామస్థులు అభినందన్ చూపించిన చాకచక్యాన్ని మర్చిపోలేకపోతున్నారు. దురదృష్టవశాత్తు పాక్ భూభాగంలో దిగాల్సి వచ్చిన అనంతరం అభినందన్ వ్యవహార శైలి, చూపించిన తెలివి అద్భుతం. అసలు ఏం జరిగిందనే విషయాన్ని అభినందన్ ప్యారాచూట్ సాయంతో దిగిన హోరాన్ గ్రమస్థులు చక్కగా చెబుతున్నారు.

వారి మాటల్లోనే.. “ఆకాశంలో కొన్ని విమానాలు తిరుగుతూ పోరాటం చేస్తున్నట్టు గుర్తించాం. కొంత సేపటి తర్వాత ఒక విమానం మంటల్లో చిక్కుకోవడం కనిపించింది. అందులోనుంచి ఒకరు ప్యారాచూట్ సాయంతో కిందకు దిగాడు. ఇక్కడే ఉన్న కొండపై దిగిడు. దీంతో మేము అక్కడికి వెళ్లే సరికి అతను ఉన్నాుడ. అయితే మమ్మల్ని చూసిన తర్వాత అతను ప్రవర్తించిన తీరును మేము ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం అని గ్రామస్థులు చెబుతున్నారు.

ముందు అతను మమ్మల్ని భారత ప్రధాని ఎవరు అని అడిగాడు. దీంతో మేము సరిగానే సమాధానం చెప్పాం. కానీ అతను వెంటనే భారత్ మాతాకీ జై అంటూ అరిచాడు. దీంతో మేము ఇది పాకిస్థాన్ అలాంటి నినాదాలు చేయొద్దని చెప్పాం. అతను వెంటనే పిస్టోల్ తీసుకుని గాల్లో కాల్పులు జరిపాడు. అప్పుడు మేము రాళ్లతో దాడి చేశాం.

కానీ కొండ పక్కనే ఉన్న ఉన్న వాగులో దూకడంతో అతను అక్కడి చిక్కుకుపోయి మాకు దొరికాడు. అతను మాపై కాల్పులు జరిపి ఉంటే మేము కూడా అతన్ని కొట్టి చంపేసేవాళ్లం కానీ అతను అలా చేయకుండా గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో మేము కూడా అతన్ని కొట్టి వదిలేశాం అని గ్రామస్థులు చెప్పారు.” ఈ లోపు పాక్ సైనికులు రావడంతో వారికి అతన్ని అప్పగించామని గ్రామస్థులు వివరిస్తున్నారు.