AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని.. నిండు గర్బిణిని చంపిన భర్త

తాగుడుకు బానిస అయిన ఓ యువకుడు కసాయిగా మారాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వనందుకు నిండు గర్బిణి అయిన భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది

తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని.. నిండు  గర్బిణిని చంపిన భర్త
Balaraju Goud
|

Updated on: Aug 27, 2020 | 12:02 PM

Share

తాగుడుకు బానిస అయిన ఓ యువకుడు కసాయిగా మారాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వనందుకు నిండు గర్బిణి అయిన భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. తుకారాంగేట్‌ ప్రాంతానికి చెందిన గౌతమ్‌ కుమార్‌(24), లాలాగూడకు చెందిన మహాలక్ష్మి(20)లది ప్రేమ వివాహం. భిక్షాటన చేస్తూ.. చిత్తు కాగితాలు అమ్మగా వచ్చే డబ్బుతో జీవిస్తున్నారు. ఏడాది బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భిణి. గాంధీ ఆసుపత్రి ఎదురుగా కాలిబాటపై నివాసం ఉంటున్నారు. గౌతమ్‌ మద్యానికి బానిసయ్యాడు. తాగి వచ్చి ప్రతిరోజు భార్యతో గొడవ పడేవాడు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి భార్యను మద్యానికి డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అందుకు మహలక్ష్మీ నిరాకరించటంతో గొడవ పడి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో పీకల్లోతు మద్యం తాగొచ్చి నిద్రపోతున్న భార్యను కత్తితో కర్కశంగా పొడిచి చంపాడు. దీంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Follow Us
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..