మార్కెట్ లోకి వచ్చేస్తున్న ‘తెలంగాణ సోనా’ బియ్యం

మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినటానికి అనుకూలంగా ఉండే తెలంగాణ సోనా బియ్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

మార్కెట్ లోకి వచ్చేస్తున్న 'తెలంగాణ సోనా' బియ్యం
Follow us

|

Updated on: Nov 04, 2020 | 5:44 PM

మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తినటానికి అనుకూలంగా ఉండే తెలంగాణ సోనా బియ్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన బేపాక్‌ సంస్థ.. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంతో మంగళవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకొంది. రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీ పరిపాలన భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీసీ ప్రవీణ్‌రావు సమక్షంలో రిజిస్ట్రార్‌ సుధీర్‌కుమార్‌, బేపాక్‌ ఫోర్‌ ఎక్స్‌ సంస్థ డైరెక్టర్‌ ఉదయ్‌ నదీవాడే ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. తెలంగాణ సోనా బియ్యం థింక్‌-3 పేరుతో అమెజాన్‌లోనూ లభించనున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణ సోనా(ఆర్‌ఎన్‌ఆర్‌-15048) రకం బియ్యానికి మరింత ప్రాచుర్యం తీసుకొచ్చేలా ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయవర్సిటీ చర్యలు చేపట్టింది. తెలంగాణ సోనా రైస్ కు విస్తృతమైన మార్కెటింగ్‌ కల్పించేలా చర్యలు చేపట్టింది. బేపాక్‌ సంస్థ ఇప్పటికే తెలంగాణ సోనా రకాన్ని మార్కెటింగ్‌ చేస్తున్నది. తమ కస్టమర్ల సంఖ్యను 2.5 లక్షల నుంచి 7 లక్షలకు పెం చుకొనేందుకు ప్రణాళికలు రూపొందించింది. రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలుచేసి.. బియ్యాన్ని మాల్స్‌, ఇతర మార్కెటింగ్‌ సంస్థలకు విక్రయించనున్నది. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు ఈ సీజన్‌లో తెలంగాణ సోనాను 10 లక్షల ఎకరాల్లో సాగుచేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో సుమారు 25 లక్షల టన్నుల బియ్యం వచ్చే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ అంచనా వేసింది.

ఇండియన్‌ టైగర్‌ & టైగ్రిస్‌ పేరుతో శ్రీకారం చుట్టిన టీవీ9.
ఇండియన్‌ టైగర్‌ & టైగ్రిస్‌ పేరుతో శ్రీకారం చుట్టిన టీవీ9.
చంద్రబాబే నాకు రాజకీయ గురువు: సుజనా చౌదరి
చంద్రబాబే నాకు రాజకీయ గురువు: సుజనా చౌదరి
సమోసాలలో కండోమ్ లు, గుట్కా, రాళ్లు.! వీడియో వైరల్..
సమోసాలలో కండోమ్ లు, గుట్కా, రాళ్లు.! వీడియో వైరల్..
వెంకటేశ్వరుడి తొలి పూజ ముస్లింలదే.! వెంకన్నను బావగారిగా ముస్లింలు
వెంకటేశ్వరుడి తొలి పూజ ముస్లింలదే.! వెంకన్నను బావగారిగా ముస్లింలు
ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండ‌ర్.! ఎవ‌రీ హేమాంగి
ప్రధాని మోదీపై పోటీ చేస్తున్న ట్రాన్స్‌జెండ‌ర్.! ఎవ‌రీ హేమాంగి
గుంటూరు కారంపై జగపతిబాబు అనాలసిస్.! ఏమన్నారంటే.?
గుంటూరు కారంపై జగపతిబాబు అనాలసిస్.! ఏమన్నారంటే.?
ఈ మరుగుదొడ్డి విలువ రూ.2 కోట్లు.. దీని స్పెషాలిటీ ఏమిటంటే
ఈ మరుగుదొడ్డి విలువ రూ.2 కోట్లు.. దీని స్పెషాలిటీ ఏమిటంటే
వివాహ సమయంలో కన్యాదానం తప్పనిసరికాదు.! హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.
వివాహ సమయంలో కన్యాదానం తప్పనిసరికాదు.! హైకోర్టు సంచలన వ్యాఖ్యలు.
వైసీపీలోకి పోతిన మహేశ్‌.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్..
వైసీపీలోకి పోతిన మహేశ్‌.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్..
అన్ని దేశాలకు హెచ్చరిక.. ఇజ్రాయెల్‌ ప్రధాని సంచలన కామెంట్స్‌.
అన్ని దేశాలకు హెచ్చరిక.. ఇజ్రాయెల్‌ ప్రధాని సంచలన కామెంట్స్‌.