విజయనగరంలో విషాదం: కరోనాతో తహశీల్దార్ మృతి
కరోనా విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ వారియర్స్ సైతం వైరస్ బారిన పడుతున్నారు. ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే తాము కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గరివిడి తహసీల్దార్‌గా పనిచేస్తున్న వ్యక్తి కొవిడ్ బారినపడి ప్రాణాలు విడిచారు
కరోనా విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ వారియర్స్ సైతం వైరస్ బారిన పడుతున్నారు. ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే తాము కరోనా కాటుకు బలవుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గరివిడి తహసీల్దార్‌గా పనిచేస్తున్న వ్యక్తి కొవిడ్ బారినపడి ప్రాణాలు విడిచారు. దీంతో ప్రభుత్వాధికారుల్లోనూ టెన్షన్ మొదలైంది. ఈ నెల 24న గరివిడి మండల కార్యాలయంలో విధులు నిర్వహిస్తుండగా ఆయనకు తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురయ్యారు. దగ్గుతో పాటు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. దీంతో స్థానిక పీహెచ్‌సీలో కరోనా పరీక్షలు నిర్వహించిన సిబ్బంది ఆయనకు వైరస్ సోకినట్లు నిర్ధారించడంతో మిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే షుగర్, బీపీ, ఆస్తమాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యాధికారులు తెలిపారు. కాగా, నాలుగు రోజుల కిందటే ఆయనకు కొమరాడ బదిలీ అయింది. అక్కడ బాధ్యతలు చేపట్టకముందే మృత్యు వడికి చేరుకున్నారు.