మహారాష్ట్ర సీఎం, గవర్నర్ మధ్య ‘టఫ్ వార్’, కోష్యారీ విమాన ప్రయాణానికి థాక్రే సర్కార్ నో పర్మిషన్
మహారాష్ట్రలో సీఎం ఉధ్ధవ్ థాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మధ్య విభేదాలు తగ్గే సూచనలు కనబడడంలేదు. ఇవి ఇంకా పెరుగుతున్నాయి. తాజాగా గవర్నర్...
మహారాష్ట్రలో సీఎం ఉధ్ధవ్ థాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మధ్య విభేదాలు తగ్గే సూచనలు కనబడడంలేదు. ఇవి ఇంకా పెరుగుతున్నాయి. తాజాగా గవర్నర్ విమాన ప్రయాణానికి థాక్రే ప్రభుత్వం అనుమతిని నిరాకరించింది. ఆయన విమానం ఎక్కగానే..తనకు అనుమతి లేదని గ్రహించారు. దీంతో ప్లేన్ దిగి మళ్ళీ రాజ్ భవన్ కి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఇందుకు కారణాలను ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించలేదు. ఉత్తరాఖండ్ లో గత ఆదివారం సంభవించిన విషాద సంఘటన గురించి తెలుసుకునేందుకు కోష్యారీ విమాన ప్రయాణం చేయదలిచారు. కానీ ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు గవర్నర్ కు అనుమతి లేదని శివసేన ఎంపీ వినాయక్ రౌత్ అన్నారు. ప్రభుత్వ పర్మిషన్ ని ఆయన కోరారని, కానీ ఆ ప్లేన్ ప్రయాణించగలదా లేదా అని తెలియలేదని అన్నారు. బహుశా అందుకే గవర్నర్ కి పర్మిషన్ లభించకపోయి ఉండవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇలా ఉండగా ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మాత్రమే హక్కు ఉంది. ఇతరులు వాడాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటున్నారు. లోగడ కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంలో కేంద్రం అన్ లాక్ ప్రకటించినా రాష్ట్రంలో ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించలేదు. ఇందుకు గవర్నర్ కోష్యారీ..ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రేకి సుదీర్ఘమైన లేఖ రాస్తూ ఆయన హిందుత్వ గురించి ప్రశ్నించారు. దీనిపై థాక్రే కూడా తీవ్రంగానే స్పందించారు. తన హిందుత్వ గురించి ప్రశ్నించే అవసరం మీకు లేదన్నారు. ఈ లేఖపై నాడు పెద్ద దుమారమే రేగింది.
Read More: Rajya Sabha: అంగుళం భూమిని కూడా వదులుకోం.. అప్పటివరకు చైనాతో చర్చలు: రక్షణమంత్రి రాజ్‌నాథ్
Read More: IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్