Rajya Sabha: అంగుళం భూమిని కూడా వదులుకోం.. అప్పటివరకు చైనాతో చర్చలు: రక్షణమంత్రి రాజ్‌నాథ్

India - China standoff: భారత్ - చైనా మధ్య గత కొంతకాలం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తూర్పు లఢఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా.. భారత సైన్యంపై..

Rajya Sabha: అంగుళం భూమిని కూడా వదులుకోం.. అప్పటివరకు చైనాతో చర్చలు: రక్షణమంత్రి రాజ్‌నాథ్
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 11, 2021 | 1:09 PM

India – China standoff: భారత్ – చైనా మధ్య గత కొంతకాలం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. తూర్పు లఢఖ్‌లోని గాల్వాన్ లోయలో చైనా.. భారత సైన్యంపై దుశ్చర్యకు పాల్పడిన నాటినుంచి సరిహద్దుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో తూర్పు లఢఖ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో ప్రసంగించారు. సరిహద్దు వివాదంలో అంగుళం భూమిని కూడా చైనాకు వ‌దులుకోమ‌ంటూ ఆయ‌న స్పష్టంచేశారు. పాంగాంగ్ స‌ర‌స్సు ఉత్తర, ద‌క్షిణ తీరాల్లో బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ‌కు చైనాతో ఒప్పందం కుదిరినట్లు ఆయ‌న వెల్లడించారు. ద‌శ‌ల వారీగా రెండు దేశాలు త‌మ తమ బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రిస్తాయ‌ని రాజ్‌నాథ్ వెల్లడించారు.

అయితే ఇప్పటికీ కొన్ని సమస్యలకు పరిష్కారం కాలేదని అవి పరిష్కారం అయ్యేంతవరకు చర్చలు కొనసాగుతాయని తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి నెలకొనాలంటే.. భద్రతా దళాలను ఉపసంహరించుకోవాలని చైనాకు స్పష్టంచేసినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. ఘర్షణల అనంతరం చైనా ఎల్ఏసీ వెంబడి దళాలతోపాటు ఆయుధ సంపత్తిని పెంచిందని.. ఈ క్రమంలో భారత్ కూడా ధీటుగా స్పందించిందని తెలిపారు. వ్యూహాత్మక ప్రదేశాల్లో మ‌న ధైర్యవంతమైన జ‌వాన్లు ఉన్నారని.. వారంతా దేశ సమగ్రత కోసం ఎంత వ‌ర‌కైనా వెళ్తామ‌న్నారని రక్షణమంత్రి రాజ్‌నాథ్ గుర్తుచేశారు.

Also Read:

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్‌ సాయమందించండి.. నరేంద్ర మోదీకి కెనడా పీఎం ఫోన్‌.. ఎలాంటి హామీ ఇచ్చారంటే?

Chennai: అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. దోహాకు తరలిస్తుండగా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే