TGPSC Group 1 Result Date: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?

తెలంగాణ గ్రూప్‌ 1 పోస్టులకు సంబంధించిన మెయిన్స్ పరీక్షలు ఇటీవల పూర్తైన సంగతి తెలిసిందే. సమాధాన పత్రాల మూల్యాంకనం ఇప్పటికే ప్రారంభమవగా.. ఫలితాలను కూడా అతి త్వరలోనే విడుదల చేసేందుకు టీజీపీఎస్సీ సన్నద్ధమవుతుంది..

TGPSC Group 1 Result Date: టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 తుది ఫలితాల తేదీ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పుడంటే?
TGPSC Group 1 Result Date
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 24, 2024 | 3:14 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 24: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్‌ 1 పోస్టులకు ఇటీవల మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాల్లో అక్టోబర్‌ 21వ తేదీ నుంచి అక్టోబర్‌ 27వ తేదీ వరకు 7 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి. ప్రిలిమ్స్‌లో 31,383 మంది క్వాలిఫై అవగా.. వారిలో కేవలం 67.17శాతం మాత్రమే అంటే 21,181 మంది ఈ పరీక్షలు రాశారు. అయితే ఈ పరీక్షల ఫలితాలు ఫిబ్రవరిలోగా విడుదల చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. యూపీఎస్సీ తరహాలో ప్రకటన ఇచ్చిన ఏడాదిలోగా నియామక ప్రక్రియ పూర్తిచేసే విధానాన్ని గ్రూప్‌ 1లో అమలు చేయాలని రేవంత్‌ సర్కార్‌ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 19లోగా తుది ఫలితాలు వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే గ్రూప్‌ 1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని టీజీపీఎస్సీ మొదలుపెట్టింది. మూల్యాంకనం అనంతరం మెరిట్‌ ఆధారంగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు పిలుస్తరాఉ. ఈ ప్రక్రియకు మరో 3 నెలల సమయం అవసరమని కమిషన్‌ భావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 563 గ్రూప్‌ 1 సర్వీసు పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర వ్యాప్తంగా 4,03,645 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరందరికీ జూన్‌ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించించింది. 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు 31,382 మందిని ఎంపిక చేసింది. వీరితోపాటు కోర్టు అనుమతి పొందిన వారితో కలిపి మొత్తం 31,403 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. అయితే వీరిలో 67.17 శాతం మంది మాత్రమే పరీక్ష రాశారు. మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం నవంబరు రెండో వారంలోనే ప్రారంభమైంది. ఒక్కో పేపరును 2 సార్లు మూల్యాంకనం చేస్తారు. రెండు దశల్లో చేసిన మ్యూల్యాంకనంలో పెద్దగా మార్పులు లేకుంటే తరువాత దశకు వెళ్తారు. బదులుగా తేడా ఎక్కువగా ఉంటే మూడో దశ మూల్యాంకనం కూడాచేసి మార్కులు కేటాయిస్తారు. మూల్యాంకనం తర్వాత మెరిట్‌ ఆధారంగా 1:2 నిష్పత్తిలో జాబితాను విడుదల చేస్తారు.

గ్రూప్‌ 1లో బ్యాక్‌లాగ్‌ కాకుండా ఉండేందుకు రీలింక్విష్‌మెంట్‌ విధానంపై అధ్యయనం చేయాలని సర్కార్‌ యోచిస్తుంది. ఇప్పటికే గ్రూప్‌ 3 రాతపరీక్షలు పూర్తయ్యాయి. వచ్చేనెలలో గ్రూప్‌ 2 రాతపరీక్షలు ఉన్నాయి. బ్యాక్‌లాగ్‌ రాకుండా ఉండేందుకు ఫిబ్రవరిలో గ్రూప్‌ 1 ఫలితాల వెల్లడి తర్వాతే గ్రూప్‌ 2, 3 ఫలితాలు వెలువరించాలని కమిషన్‌ భావిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.