AP News: రన్నింగ్ ఆర్టీసీ బస్సులో యువకుడి సూసైడ్
ఏం కష్టం వచ్చిందో ఏమో ఆ యువకుడు రన్నింగ్ బస్సులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మార్గమధ్యంలో యువకుడు ఉరికి వేలాడటాన్ని గమనించిన తోటి ప్రయాణికులు.. షాక్ తిన్నారు. వెంటనే బస్సు కండెక్టర్, డ్రైవర్‌కు విషయం చెప్పారు.
శ్రీకాళహస్తిలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. రన్నింగ్ ఆర్టీసీ బస్సులో గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఆందోళనకు గురిచేసింది. పల్లె వెలుగు బస్‌లో వెనకాల కూర్చున్న యువకుడు ఉరి వేసుకున్నాడు. ఏర్పేడు మండలం అంజిమేడు దగ్గర ఉదయం 5:30కి సదరు యువకుడు బస్ ఎక్కినట్లు కండక్టర్ చెబుతున్నారు. ఉదయం బస్సులో నలుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో అతను బస్సులోనే.. మంచం నవారి లాంటి తాడుతో పైన కడ్డీకి ఉరి వేసుకుని.. ఆత్మహత్య చేసుకున్నాడు. గుత్తివారి పల్లి వద్ద యువకుడు ఉరికి వేలుడుతూ ఉండటాన్ని గమనించి షాక్ తిన్నారు తోటి ప్రయాణికులు. వెంటనే బస్సు ఆపిన… కండక్టర్, డ్రైవర్.. రేణిగుంట పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. అతడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
ఆటోడ్రైవర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా వీడియో
మెస్సి పేరుతో టీ స్టాల్.. ఫుట్బాల్ స్టార్ ను కలిసే అవకాశం వీడియో
ఇదేం విచిత్రం.. మండు వేసవి ముందే వచ్చిందా వీడియో
మీరు గ్రేట్ సార్ ఓటు కోసం విమానంలో వచ్చి వీడియో
పాక్లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్

