Konaseema: దేశంలో ఇంకా లాంచ్ కానీ టెస్లా ట్రక్ కోనసీమకు వచ్చింది.. అందులో వచ్చింది ఎవరంటే..?
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అరుదైన దృశ్యం కనిపించింది. ఫ్యూచరిస్టిక్ లుక్‌తో ఉన్న టెస్లా సైబర్ ట్రక్ అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో సందడి చేసింది. చెన్నైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆదిత్య రామ్ సంక్రాంతి పండుగ సందర్భంగా అత్తారింటికి టెస్లా సైబర్ ట్రక్‌లో రావడంతో జనం ఆసక్తిగా తిలకించారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో టెస్లా సైబర్ ట్రక్ సందడి చేసింది. కోనసీమలో జరిగే సంక్రాంతి సంబరాలకు చెన్నైకు చెందిన వ్యాపార దిగ్గజం ఆదిత్య రామ్ అత్తారింటికి టెస్లా సైబర్ ట్రక్‌లో వచ్చారు. ఎక్కడా చూడని కొత్త, వింత వాహనం కావడంతో.. చూసేందుకు జనం గుమిగుడారు. టెస్లా సైబర్ ట్రక్‌లో కోనసీమకు వచ్చిన వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త ఆదిత్య రామ్. ఆయన కోనసీమ అల్లుడు. పండుగ వేళ అత్తారింటికి వచ్చారు. అమలాపురం గడియార స్తంభం సెంటర్లో ఆయన వాహనాన్ని చూసి జనం వింతగా ఉందంటూ ఆసక్తిగా చూసి సెల్ఫీలు దిగారు. కోనసీమకు వచ్చిన వ్యాపారవేత్త ఆదిత్యా రామ్‌కు అమలాపురం గడియార స్తంభం సెంటర్లో అత్తింటి బంధువులు ఘనంగా స్వాగతం పలికారు. గడియార స్తంభం సెంటర్లో కారు ఆగడంతో అటుగా వెళ్లే జనం ఆగి కారుతో సెల్ఫీలు తీసుకున్నారు. దీంతో కొంతసేపు అమలాపురం గడియారం సెంటర్లో ట్రాఫిక్‌కు అంతరాయం కూడా ఏర్పడింది. సెల్ఫీలు తీసుకున్న అనంతరం ఆదిత్య అక్కడి నుంచి ఆ కారులో బయలుదేరి అత్తారింటికి వెళ్లి పోయారు.
టెస్లా సైబర్ ట్రక్ ఫ్యూచరిస్టిక్, బుల్లెట్‌ప్రూఫ్ లుక్‌తో స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ కలిగి ఉంటుంది. ఒక్కసారి చార్జ్‌తో సుమారు 400–500 కి.మీ ప్రయాణిస్తుంది. ఇది ఇండియాలో అధికారికంగా లాంచ్ కాలేదు. ఆదిత్య రామ్ ప్రవేట్ ఇంపోర్ట్ చేసుకుని ఉంటారు. లేదా టెంపరరీ / డెమో రిజిస్ట్రేషన్ తో తీసుకువచ్చి ఉండాలి. భారీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, ఆటోపైలట్ / సెల్ఫ్ డ్రైవింగ్ సపోర్ట్, భారీ లోడ్ మోయగల సామర్థ్యం (పికప్ ట్రక్), ఆఫ్‌రోడ్‌కు అనుకూలం వంటి సౌలభ్యాలు దీనికి ఉంటాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
