గద్వాల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
గద్వాల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత తెలెత్తింది. ఎంఐఎం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు కార్యకర్తలకు గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారిని చెదరగొట్టి, గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా.. మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. కాగా.. పలువురు రాజకీయ ప్రముఖులు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే తమ ఓటు హక్కును […]
గద్వాల్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత తెలెత్తింది. ఎంఐఎం, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో పలువురు కార్యకర్తలకు గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారిని చెదరగొట్టి, గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. కాగా.. మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. కాగా.. పలువురు రాజకీయ ప్రముఖులు వివిధ ప్రాంతాల్లో ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.