బ్రేకింగ్: గుంటూరులో ఉద్రిక్తత.. డీఎస్పీ కాలర్ పట్టుకున్న టీడీపీ నేతలు
గుంటూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరులో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. బంద్ కొనసాగుతున్నా.. రోడ్డుపైకి వచ్చి రైతులు, విద్యార్థి సంఘాలు, టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. పోలీసులు, వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో డీఎస్పీ సీతారామయ్య కాలర్ పట్టుకున్నారు టీడీపీ నేతలు. దీంతో.. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో.. అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. కాగా.. విద్యార్థి యువజన ఐకాస ఆధ్వర్యంలో […]
గుంటూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకిస్తూ గుంటూరులో నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. బంద్ కొనసాగుతున్నా.. రోడ్డుపైకి వచ్చి రైతులు, విద్యార్థి సంఘాలు, టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. పోలీసులు, వీరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో డీఎస్పీ సీతారామయ్య కాలర్ పట్టుకున్నారు టీడీపీ నేతలు. దీంతో.. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో.. అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
కాగా.. విద్యార్థి యువజన ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థులు గుంటూరులో నిరసన చేపట్టారు. ఎన్టీఆర్ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. కళాశాల, పాఠశాల బస్సులను అడ్డుకున్నారు. మూడు రాజధానుల ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. తాజాగా గుంటూరు బంద్‌పై పోలీసులు ప్రకటన జారీ చేశారు. బంద్‌కు ఎలాంటి అనుమతులు లేవని, బంద్‌తో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయన్నారు. పాఠశాలలు, దుకాణాలు బలవంతంగా మూయించవద్దని, శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే ఉపేక్షించేది లేదని పోలీసులు పేర్కొన్నారు.