Breaking : కత్తి మహేష్ అరెస్ట్
కత్తి మహేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన్ను తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Kathi Mahesh Arrest : కత్తి మహేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన్ను తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాముని మీద ఫేస్ బుక్‌లో కత్తి మహేష్ అసభ్య కామెంట్స్ చేశారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు… నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నటుడు, సినిమా, రాజకీయ విశ్లేషకుడైన కత్తి మహేష్ ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కున్నారు. అగ్రకథానాయకులుపై నెగటీవ్ కామెంట్స్ చేసి..వారి అభిమానుల ఆగ్రహాన్ని సైతం చవిచూశాడు. కాగా గతంలో కూడా కత్తి మహేశ్ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు..సోషల్ మీడియాలో దుమారం రేపాయి.
Also Read : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ : ఈ నెలలో ఒకేసారి 90 గుడ్లు పంపిణీ