AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేదల కోసం సుమారు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం: కేటీఆర్

ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం కట్టి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పేదల కోసం సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు.

పేదల కోసం సుమారు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం: కేటీఆర్
Balaraju Goud
|

Updated on: Aug 27, 2020 | 9:49 AM

Share

ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం కట్టి ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో పేదల కోసం సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఇందులో 85 వేల ఇళ్లను ఈ ఏడాది చివరి నాటికి అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఒకటి రెండ్రోజుల్లో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకంపై మంత్రి కేటీఆర్‌ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్లతో పాటు జీహెచ్‌ఎంసీ హౌసింగ్, పురపాలక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేశంలోని ఏ ఇతర మెట్రో నగరంలో లేని విధంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.9,700 కోట్ల వ్యయంతో పేదల కోసం ఇళ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులు చాలా చోట్ల ఆగస్టు నెలాఖరు నుంచి డిసెంబర్‌ చివరి నాటికి పూర్తవుతాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన చోట అర్హులైన పేదలకు ఇళ్లు పంపిణీ చేయాలన్నారు.

అలాగే, జీహెచ్‌ఎంసీ దాని పరిసర జిల్లాల్లోని మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 4 వేల ఇళ్లు అందజేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చిన మురికివాడల్లోని ప్రజల జాబితా రూపొందించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

Follow Us
50 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల నవయవ్వన కాంతి.. ఈ 5 సులువైన అలవాట్లతో...
50 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల నవయవ్వన కాంతి.. ఈ 5 సులువైన అలవాట్లతో...
DMartలో ఈ 5 వస్తువులు కొనేముందు ఆలోచించండి.. ఈ టిప్స్‌ పాటించండి!
DMartలో ఈ 5 వస్తువులు కొనేముందు ఆలోచించండి.. ఈ టిప్స్‌ పాటించండి!
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు!
జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి
జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి
సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు..
సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు..
భాద్రపద పౌర్ణమి రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ఐశ్వర్యం
భాద్రపద పౌర్ణమి రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ఐశ్వర్యం
మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో..
మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో..
రాజయోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్! ధనం, ఉద్యోగంలో..
రాజయోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్! ధనం, ఉద్యోగంలో..
కొత్త తరానికి కొత్త విద్యా విధానం అవసరం: సద్గురు మధుసూదన్ సాయి
కొత్త తరానికి కొత్త విద్యా విధానం అవసరం: సద్గురు మధుసూదన్ సాయి