Telangana : నోటిఫికేషన్ల జాతరలో లైబ్రరీలకు యువతీ,యువకులు.. గుడ్‌న్యూస్‌ చెప్పిన సర్కార్‌

|

Jun 08, 2022 | 9:22 PM

తెలంగాణలో ఇప్పుడంతా నోటిఫికేషన్ల జాతర నడుస్తోంది. వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. మొన్నటిదాకా వెయ్యి కళ్లతో ఎదురుచూసిన నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వరంగా మారాయి. నోటిఫికేషన్ల రిలీజ్‌తో లైబ్రరీలకు క్యూ కడుతున్నారు యువతీ, యువకులు.

Telangana : నోటిఫికేషన్ల జాతరలో లైబ్రరీలకు యువతీ,యువకులు.. గుడ్‌న్యూస్‌ చెప్పిన సర్కార్‌
Libraries
Follow us on

తెలంగాణలో ఇప్పుడంతా నోటిఫికేషన్ల జాతర నడుస్తోంది. వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. మొన్నటిదాకా వెయ్యి కళ్లతో ఎదురుచూసిన నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు వరంగా మారాయి. నోటిఫికేషన్ల రిలీజ్‌తో లైబ్రరీలకు క్యూ కడుతున్నారు యువతీ, యువకులు. కొంతమంది కోచింగ్‌ సెంటర్లకు పరుగులు తీస్తుండగా.. మరికొందరు లైబ్రరీలను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి వారికి లైబ్రరీల పనివేళలు ఇబ్బందిగా పరిణమించాయి. రోజులో కొద్దిగంటలు మాత్రమే గ్రంథాలయాలు తెరిచి ఉండడంతో నిరుద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం గ్రంథాలయాల పనివేళల్ని మార్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

తాజాగా గ్రంథాలయాల పాఠకులకు శుభవార్త చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్. ఇక నుంచి ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రంథాలయాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. లైబ్రరీల అభివృద్ధిపై సమీక్ష జరిపిన మంత్రి.. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు తలసాని. అవసరమైన గ్రంథాలయాల దగ్గర అన్నపూర్ణ భోజన కేంద్రాల ఏర్పాటు చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు.

ఇటీవల మరో నోటిఫికేషన్‌ వెలువరించింది తెలంగాణ సర్కార్‌. 1433 ఉద్యోగ నియామకాలకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో 1433 వివిధ క్యాడర్‌ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి