నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా..

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.

  • Ravi Kiran
  • Publish Date - 1:13 am, Thu, 18 June 20
నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా..

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు రంగం సిద్దమైంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను మంత్రి రిలీజ్ చేస్తారు. ఇక విద్యార్ధులు తమ ఫలితాలను tsbie.cgg.gov.in, manabadi.co.in, schools9.com వెబ్‌సైట్లలో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి విద్యార్ధులు చెక్ చేసుకోవచ్చు.

వీటితో పాటు గూగుల్ ప్లే స్టోర్‌లో TSBIE m-Services అనే యాప్ డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంటర్ ఫలితాలను తెలుసుకోవచ్చు. కాగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 95.72 శాతం మంది హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు అధికారులు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. ఆ నెల 23వ తేదీ వరకూ కొనసాగిన విషయం తెలిసిందే.