అక్టోబర్‌ 17 నుంచి 24 వరకు బతుకమ్మ

ఈ నెల 17న ఎంగిలి పూల బతుకమ్మ ఆడుకోవాలని, ఇందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేయాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి వెల్లడించింది.

  • Balaraju Goud
  • Publish Date - 8:54 am, Thu, 10 September 20
అక్టోబర్‌ 17 నుంచి 24 వరకు బతుకమ్మ

ప్రతి ఏడాది బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు తెలంగాణ ఆడపడుచులు ఎక్కడున్నా వారం రోజుల ముందే పుట్టింటికి చేరుకుని ఆనందోత్సాహాలతో పండుగ ఏర్పాట్లు చేసుకుంటారు. తిరొక్క పూలతో రంగు రంగుల బతుకమ్మలను రోజుకో తీరుతో సద్దుల బతుకమ్మ నాటికీఆనందోత్సాహాలతో పూల పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అధిక ఆశ్వీయుజ మాసం వచ్చినందున బతుకమ్మ పండుగపై హిందువుల్లో కొంత సందిగ్ధం ఏర్పడింది. ఎంగిలిపూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ పండుగలపై తె ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపై తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి స్పష్టతనిచ్చింది.

ఈ నెల 17న ఎంగిలి పూల బతుకమ్మ ఆడుకోవాలని, ఇందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేయాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి వెల్లడించింది. అక్టోబర్‌ 17న బతుకమ్మ పేర్చి నాటినుంచి 24వ తేదీన దుర్గాష్టమి వరకు బతుకమ్మను ఎనిమిది రోజులు పేర్చి, పూజించి జానపదాలతో ఆడి నిమజ్జనం చేయాలని సూచించారు. . పెద్దల అమావాస్యనాడు పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడంతోపాటు ఎంగిలిపూల బతుకమ్మ నిర్వహించడం మన ఆచారమని పేర్కొన్నారు. ఇక, రంగురంగుల పూలతో ఊరు వాడా బతుకమ్మలతో సంబురం మొదలుకానుంది.