అవసరమైతే ఆ స్కూల్‌ను సీజ్ చేస్తాం..

సినీ నటుడు శివ బాలాజీ ఫిర్యాదుపై స్పందించిన విద్యాశాఖ స్పందించింది. మణికొండలోని మౌంట్ లిటరజీ స్కూల్‌ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులుపై స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది.

అవసరమైతే ఆ స్కూల్‌ను సీజ్ చేస్తాం..
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 16, 2020 | 8:40 PM

సినీ నటుడు శివ బాలాజీ ఫిర్యాదుపై స్పందించిన విద్యాశాఖ స్పందించింది. మణికొండలోని మౌంట్ లిటరజీ స్కూల్‌ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులుపై స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. 46 జీవో ఉల్లంఘించలేదంటూ విద్యాశాఖ అధికారులకు తెలిపింది. ఆన్‌లైన్ తరగతులకు విద్యార్థులను డిస్కనెక్ట్ చేయకూడదంటూ పాఠశాల యాజమాన్యాలకు రంగారెడ్డి డీఈఓ విజయలక్ష్మి హెచ్చరించారు. అలాంటి పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవుంటూ పేర్కొన్నారు. అవసరమైతే పాఠశాలలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

అధిక ఫీజులు వసులు చేస్తున్నారంటూ హెచ్ఆర్సీని సినీ నటుడు శివబాలాజీ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఫీజుల పేరుతో దోపిడీకి దిగుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మణికొండలోని మౌంట్ లిటరజీ స్కూల్ ఫీజుల విష‌యంలో తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్(HRC) ఛైర్మన్‌కు సినీ నటుడు శివబాలాజీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ స్కూల్ యాజమాన్యం ఫీజ్ కోసం వేధిస్తుంది అని ఆరోపించారు. ఫీజులు తగ్గించుకోమని అడిగితే తన కుమారుడిని ఆన్లైన్ క్లాసుల నుండి అర్ధాంతరంగా డిస్ కనెక్ట్ చేసారు హెచ్ఆర్సీ రాసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు పై హెచ్‌ఆర్‌సి స్పందించింది.

మౌంట్ లిటేరాజీ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌సి ఆదేశించింది. సమగ్ర విచారణ చేసి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డిఇవో కి నోటీసులు జారీ చేసింది. అయితే చాలా మంది తలిదండ్రులను ఇలానే ఇబ్బంది పెడుతున్నారని చెప్పిన ఆయన వారంత బయటికి చెప్పడానికి భయపడుతున్నారని అన్నారు.