ఫీ.. జులంపై తెలంగాణ విద్యాశాఖ కొరఢా

నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై తెలంగాణ విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి స్కూల్‌లో తనిఖీలు నిర్వహించింది. ఈ రెండు...

ఫీ.. జులంపై తెలంగాణ విద్యాశాఖ కొరఢా
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 09, 2020 | 3:18 PM

Telangana Department of Education : నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై తెలంగాణ విద్యాశాఖ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి స్కూల్‌లో తనిఖీలు నిర్వహించింది. ఈ రెండు స్కూల్స్ తోపాటు మరో 15 పాఠశాలలపై దాడులు నిర్వహించినట్లుగా హైదరాబాద్ డీఈవో వెంకట నరసమ్మ తెలిపారు.

అయితే తమ తనిఖీల్లో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, గీతాంజలి స్కూల్స్ యాజమాన్యం నిబంధనల ఉల్లంఘంచినట్లుగా గుర్తించామని అన్నారు. ప్రధానంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో 46ని ఉల్లంఘిస్తున్నారు అని అన్నారు. ట్యూషన్ ఫీజు , టెర్మె ఫీజులు స్కూల్స్ పెంచినట్లు గుర్తించామన్నారు.

అందుకే రెండు పాఠశాలలకు నోటీసులు జారీచేశామని తెలిపారు. స్కూల్స్ రికార్డు తనిఖీచేసిన తర్వాత ఏ ఉల్లంఘనలు జరిగాయో వెల్లడిస్తామన్నారు. తనిఖీల సమయంలో రికార్డ్స్ పూర్తి స్థాయిలో స్కూల్స్ ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి అన్ని పత్రాలను ఇవ్వాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నాయని వెల్లడించారు.