రాజస్థాన్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా మరో 149..
రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వందల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు..
రాజస్థాన్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వందల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం నాడు కొత్తగా మరో 149 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,212కి చేరింది. ఈ విషయాన్ని రాజస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,846 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గురువారం నాడు రికార్డు స్థాయిలో 24,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,67,296కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2.69 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 4.76 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
149 #COVID19 cases & 7 deaths reported in Rajasthan today. Total number of cases in the state is now at 22212, including 4846 active cases & 489 deaths: State Health Department pic.twitter.com/VJil0Y8jJo
— ANI (@ANI) July 9, 2020