తెలంగాణలో లక్షా యాభై వేలు దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం ఏమాత్రం తగ్గడంలేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇవాళ నమోదై న కొత్త కేసులతో తెలంగాణలో లక్షా యాభై వేల మార్క్ దాటేసింది.

తెలంగాణలో లక్షా యాభై వేలు దాటిన కరోనా కేసులు
Follow us

|

Updated on: Sep 10, 2020 | 9:32 AM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం ఏమాత్రం తగ్గడంలేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఇవాళ నమోదై న కొత్త కేసులతో తెలంగాణలో లక్షా యాభై వేల మార్క్ దాటేసింది.. మంగళవారం రాత్రి ఎనిమిదింటి నుంచి బుధవారం రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,534 మందికి కరోనా సోకినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 63,017 మందికి కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,534కి కొవిడ్‌ పాజిటివ్ గా తేలినట్లు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,50,176కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనా బారినపడి 11 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 927 మంది కరోనాను జయించలేక మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,071 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,17,143కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,106 యాక్టివ్‌ కేసులు ఉండగా అందులో 25,066 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. కొందరు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్సపొందుతుండగా, మరికొందరు ఇళ్లల్లో ఉంటూ వైద్యుల సలహా మేరకు చికిత్సపొందుతున్నారు. ఇక, జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న ఒక్క రోజే 327 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కొవిడ్‌ నిర్థారణ పరీక్షల సంఖ్య 19,53,571కి చేరుకుంది.