బోధనాస్పత్రుల వైద్యులకు యూజీసీ జీతాలు.. జీవో జారీ..
బోధనాస్పత్రుల్లో పని చేసే వైద్యులకు యూజీసీ జీతాలు విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ తాజాగా జీవో విడుదల చేసింది.

Doctors In Telangana: బోధనాస్పత్రుల్లో పని చేసే వైద్యులకు యూజీసీ జీతాలు విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ తాజాగా జీవో విడుదల చేసింది. గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బోధనా వైద్యులకు సంబంధించి యూజీసీ వేతన సవరణ 2016కి ఇటీవల జరిగిన కేబినేట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
ఈ జీవోపై వైద్య అధ్యాపకులు స్పందించారు. ప్రభుత్వ ఉత్తర్వు నెంబర్ GOMS NO 43 HMFW Telanganaతో తాజాగా వెలువడిందన్న వైద్య అధ్యాపకులు.. త్వరలోనే అరియర్స్ జీవో వెలువడాలని, అంతేకాకుండా ఏడవ వేతన సవరణకు అనుగుణంగా రవాణా భత్యాన్ని కూడా మంజూరు చేయాలన్నారు. కోవిడ్-19 సమయంలో తమ సేవలను గుర్తించి కీలక సమయంలో ఆమోదం తెలపడంతో.. ఈ సంక్షోభం సమయంలో మరింత ఉత్సాహంతో పనిచేయడానికి ఇది సహకరిస్తుందని వైద్యులు అంటున్నారు.
Also Read:
విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..
‘మనసు మమత’ శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..
తెలంగాణ సర్కార్ సంచలనం.. ఇకపై ‘లైఫ్‌టైమ్ క్యాస్ట్ సర్టిఫికెట్’..




