AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ క‌రోనా రౌండ‌ప్ : 30వేల‌కు చేరువ‌లో కేసులు..ఒక్కరోజే 11 మంది మృతి

తెలంగాణలో కరోనా వీర‌విహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. బుధవారం నిర్దారించిన వాటితో క‌లిపి మొత్తం కేసులు 30 వేలకు చేరువయ్యాయి.

తెలంగాణ క‌రోనా రౌండ‌ప్ :  30వేల‌కు చేరువ‌లో కేసులు..ఒక్కరోజే 11 మంది మృతి
Ram Naramaneni
|

Updated on: Jul 08, 2020 | 10:30 PM

Share

తెలంగాణలో కరోనా వీర‌విహారం చేస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతోంది. బుధవారం నిర్దారించిన వాటితో క‌లిపి మొత్తం కేసులు 30 వేలకు చేరువయ్యాయి. బుధవారం మొత్తం 1,924 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో అధికారులు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 29,536కు చేరుకుంది. ఇక ప్ర‌జంట్ తెలంగాణ‌లో యాక్టివ్ కేసులు 11,933గా ఉన్నాయి. గత 24 గంటల్లో 992 మంది వ్యాధి బారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17,279కు చేరింది.

ఇక బుధవారం మరో 11 మంది కరోనా కార‌ణంగా చ‌నిపోగా, మొత్తం ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 324కి చేరింది. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీలోనే అధికంగా 1,590 కొత్త కేసులు నమోదు కావడం ఆందోళ‌న‌క‌రంగా మారింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 99 కేసులు నమోదు కాగా, మేడ్చల్ జిల్లాలో 43 కొత్త కోవిడ్-19 కేసులను గుర్తించారు. ఆ తర్వాతి స్థానంలో వరంగల్ అర్బన్ జిల్లాలో 26 కేసులు నమోదయ్యాయి. ఇక సంగారెడ్డిలో 20, నిజామాబాద్‌లో 19, కరీంనగర్‌లో 14, నల్గొండ, రాజన్న సిరిసిల్లలో 13 కేసులు న‌మోద‌య్యాయి. వనపర్తిలో 9 మందికి, సూర్యాపేట, వరంగల్ అర్బన్ జిల్లాల్లో ఏడుగురు చొప్పున క‌రోనా సోకింది. యాదాద్రి, పెద్దపల్లి, మెదక్ జిల్లాల్లో ఐదుగురు చొప్పున కరోనా బారిన ప‌డ్డారు. కామారెడ్డి, జగిత్యాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 3  చొప్పున కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆసిఫాబాద్, నారాయణ పేట జిల్లాల్లో ఒకరి చొప్పున కరోనా సోకింది.

చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
చలికాలంలో గర్భిణీలు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలి.. తక్కువ తాగితే..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
అయ్యో అన్నదాత.. చలికి ఎదగని నారుమళ్లు.. ఆందోళనలో మెదక్ రైతన్నలు..
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
సామాన్యులకు అందుబాటు ధరలో బంగారం.. కేంద్రం కొత్త మార్గం..!
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
ప్రాణాలు తీస్తున్న మాంజా.. పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పు
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
బంగారం, వెండి పరుగులు..మధ్యలో పోటీ పడుతున్న మరో లోహం..! బీ అలర్ట్
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
మీరు తింటున్నది జీలకర్రనా లేక గడ్డి విత్తనాల.. నకిలీ జీరాను ఇలా..
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
జమ్మూకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల కలకలం.. 48 గంటల్లో రెండోసారి.. సై
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
సంక్రాంతి 'పెద్దల బియ్యం' వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత
ఈ ఫుడ్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తిన్నారంటే.. విషం తిన్నట్లే..! జాగ్రత