AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ క‌రోనా అప్‌డేట్స్..జిల్లాల వారీగా

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అధికంగానే కొన‌సాగుతోంది. వైద్య‌, ఆరోగ్య శాఖ తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం ఆదివారం తెలంగాణలో 1256 మందికి కొత్తగా కరోనా సోకిన‌ట్టు నిర్దార‌ణ అయ్యింది.

తెలంగాణ క‌రోనా అప్‌డేట్స్..జిల్లాల వారీగా
Ram Naramaneni
|

Updated on: Aug 10, 2020 | 9:40 AM

Share

Telangana Corona Cases : తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి అధికంగానే కొన‌సాగుతోంది. వైద్య‌, ఆరోగ్య శాఖ తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం ఆదివారం రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు తెలంగాణలో 1256 మందికి కొత్తగా కరోనా సోకిన‌ట్టు నిర్దార‌ణ అయ్యింది. ఆదివారం సెల‌వు దినం కావ‌డంతో..త‌క్కువ సంఖ్య‌లో టెస్టులు చెయ్య‌డం వ‌ల్ల‌..పాజిటివ్ కేసుల సంఖ్య కూడా త‌క్కువ‌గా న‌మోదైంది. ఆదివారం రాష్ట్రంలో మొత్తం 11,609 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 1700 శాంపిళ్ల ఫలితం రావాల్సి ఉంది. రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్పటి వరకూ 6,24,840 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయగా.. 80,751 మందికి పాజిటివ్ అని తేలింది.  ప్రస్తుతం రాష్ట్రంలో 22,528 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 389 కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డిలో 86, సంగారెడ్డి 74, కరీంనగర్ 73, వరంగల్ అర్బన్ 67, ఆదిలాబాద్ 63, నల్గొండ 58 చొప్పున కోవిడ్-19 కేసులను గుర్తించారు. అయితే అన్ని జిల్లాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గగా.. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం గతంలో ప్ర‌మాద‌కరంగా 63 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఆదివారం భువనగిరి, ములుగు జిల్లాల్లో మూడు చొప్పున కొత్త కేసులను నిర్దారించారు. ఆసిఫాబాద్ జిల్లాలో కొత్తగా కేసులేవీ నమోదు కాలేదు. రాష్ట్రంలో ఆదివారం 10 మంది కరోనా కారణంగా చ‌నిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 637కి చేరింది.

Also Read : కాస్త రిలీఫ్ : స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌ !

Also Read : బంగా‌ళా‌ఖా‌తంలో అల్ప‌పీ‌డనం : తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే