చేనేత మాస్కులు సూప‌ర్ సేఫ్ !

చేనేత మాస్కులు సూప‌ర్ సేఫ్ !

మాస్క్ ఇప్పుడు మ‌నిషికి ర‌క్ష‌ణ ఆయుధం. క‌నిపించ‌ని శత్రువు నుంచి మ‌న‌ల్ని కాపాడేది మాస్క్ మాత్ర‌మే. కాగా క‌రోనా ద‌రిచేర‌కుండా ఉండ‌టానికి ఇప్పుడు ప‌లు ర‌కాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి.

Ram Naramaneni

|

Aug 10, 2020 | 9:24 AM

Handloom Masks : మాస్క్ ఇప్పుడు మ‌నిషికి ర‌క్ష‌ణ ఆయుధం. క‌నిపించ‌ని శత్రువు నుంచి మ‌న‌ల్ని కాపాడేది మాస్క్ మాత్ర‌మే. కాగా క‌రోనా ద‌రిచేర‌కుండా ఉండ‌టానికి ఇప్పుడు ప‌లు ర‌కాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏది స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. రోజు ర‌క‌ర‌కాల వార్త‌లు మాస్కుల‌కు స‌బంధించి స‌ర్కులేట్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ఏ ర‌కం మాస్క్ సమర్థంగా రక్షణ కల్పిస్తుందనేదానిపై అమెరికాలోని డ్యూక్ యూనివ‌ర్సిటీ సైంటిస్టులు ప‌రిశోధ‌న‌లు చేశారు. త‌క్కువ ఖ‌ర్చు, మంచి డిజైన్‌తో మాస్కులు త‌యారు చేయ‌డానికి త‌మ ప‌రిశోధ‌న ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు.

ఈ ప‌రిశోధ‌న అనంత‌రం ఎన్‌95 గ్రేడ్‌ మాస్కులు, సర్జికల్ మాస్కులు, చేనేత మాస్కులు బెస్ట్ అని తేల్చారు. నోటికి క‌ర్చీప్, మెడకు మఫ్లర్‌, ఇతర వస్త్రాలను కట్టుకున్నా ఎలాంటి ఉప‌యోగం ఉండబోదని గుర్తించారు. ఇవి నోటి తుంపర్లను అడ్డుకోలేవని స్ప‌ష్టం చేశారు. పలువురు వ్యక్తులకు వివిధ రకాల మాస్కులు కట్టి మాట్లాడించడం ద్వారా శోధ‌నాలు సాగించారు. ఆ స‌మయంలో వారి నోటి నుంచి వచ్చిన తుంపర్లను సెల్‌ఫోన్‌ ద్వారా షూట్ చేసి, కంప్యూటర్‌ ద్వారా విశ్లేషించారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాస్కులు సరిగ్గా కట్టుకోనప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయనేదానిపై ఇంకా పరిశోధనలు చెయ్యాల్సి ఉందని సైంటిస్టులు తెలిపారు. ఈ ఫలితాలు సైన్స్‌ అడ్వాన్సెస్‌ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

Also Read : కాస్త రిలీఫ్ : స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌ !

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu