Telangana Corona Updates : గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 631 కొవిడ్ కేసులు..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 57,405 మందికి కరోనా పరీక్షలు చేయగా.. అందులో కొత్తగా 631 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Telangana Corona Updates : గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 631 కొవిడ్ కేసులు..
Follow us
Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 04, 2020 | 11:40 AM

corona updates in Telangana: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 57,405 మందికి కరోనా పరీక్షలు చేయగా.. అందులో కొత్తగా 631 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,72,123కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కరోనా వైరస్ కేసుల బులిటెన్ విడుదల చేసింది. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 1,467కి చేరింది. కరోనా మహమ్మారి నుంచి నిన్న ఒక్కరోజే 802 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,61,830కి చేరింది. తెలంగాణలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 8,826 ఉండగా, అందులో 6,812 మంది హోం ఐసోలేషన్‏లో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటివరకు 56,62,711 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి.

ఇంకా చదవండి:

GHMC Election Result 2020 Live Update : కొనసాగుతోన్న ఓట్ల లెక్కింపు, పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..