జగిత్యాల ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ ఫోన్ కాల్.. పంట కొనుగోలుపై ఆరా..

ఊహించని రీతీలో వ్యవహరించటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిపాటు. ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజలకు నేరు అందుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు.

జగిత్యాల ఎమ్మెల్యేకు సీఎం కేసీఆర్ ఫోన్ కాల్.. పంట కొనుగోలుపై ఆరా..
Follow us

|

Updated on: Nov 09, 2020 | 9:43 PM

ఊహించని రీతీలో వ్యవహరించటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పరిపాటు. ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజలకు నేరు అందుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటారు. ప్రజల కోసం తీసుకువచ్చిన పథకాలు ఎంతవరకు చేరుతున్నాయని స్వయంగా తెలుసుకుంటారు. ప్రజా సంక్షేమ పథకాలు ఎంతమేర సత్ఫలితాలు ఇస్తున్నాయో తానే పర్యవేక్షిస్తుంటారు. ఇదే ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ పెంచేలా చేస్తోంది. తాజాగా రైతు సమస్యలపై ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి వాకబు చేశారు సీఎం కేసీఆర్.

ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో అన్నదాతల పంట కొనుగోళ్లపై ఆరా తీశారు. మక్కల కొనుగోలు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ట్రేడర్ల కొనుగోలు తీరు ఎలా ఉందని సీఎం కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నట్లు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, మద్దతు ధర కల్పించి రైతులు నష్టపోకుండా చూడాలని సూచించినట్లు పేర్కొన్నారు.. పాలనాపరమైన ప్రతిఅంశంపై దృష్టిపెడుతూనే అన్నదాతల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా తెలుసుకుంటూ పరిష్కరించాలని ఎమ్మెల్యేలను, స్థానిక ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నారు.