Revanth Reddy: గాంధీభవన్ కు వాస్తు మార్పులు చేపట్టిన కొత్త అధ్యక్షులు రేవంత్ రెడ్డి … శరవేగంగా పనులు

|

Jul 02, 2021 | 9:33 PM

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అని ఆ నేతలు చెప్పుకున్నా తెలంగాణాలో కాంగ్రెస్ గడ్డుకాలం ఎదుర్కొంటోంది. దీంతో కాంగ్రెస్ కు మళ్ళీ జీవం పోయడానికి చార్మింగ్ లీడర్ రేవంత్ రెడ్డి కి..

Revanth Reddy: గాంధీభవన్ కు వాస్తు మార్పులు చేపట్టిన కొత్త అధ్యక్షులు రేవంత్ రెడ్డి ... శరవేగంగా పనులు
Revanth Reddy
Follow us on

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అని ఆ నేతలు చెప్పుకున్నా తెలంగాణాలో కాంగ్రెస్ గడ్డుకాలం ఎదుర్కొంటోంది. దీంతో కాంగ్రెస్ కు మళ్ళీ జీవం పోయడానికి చార్మింగ్ లీడర్ రేవంత్ రెడ్డి కి పార్టీ పగ్గాలు అప్పగించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ కొత్త అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాంధీభవన్ కు వాస్తు మార్పులు చేపట్టారు. వాస్తు పండితుల సూచన మేరకు సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. బాధ్యతలు చేపట్టేనాటికి కొత్త కళ సంతరించుకునేలా శర వేగంగా పనులు జరిపి స్తున్నారు.

కొత్త అధ్యక్షుని రాకతో సరి కొత్త మార్పులు రాబోతున్న యి. ఇప్పటివరకు ఉన్న భవన్ లో వాస్తు మార్పులు చేపట్టారు. ఇప్పటికే వాస్తు పండితులు, వేదమూర్తుల తో గాంధీభవన్ లోపల బయట చేపట్టవలసిన మార్పుల పై చర్చించి మ్యాప్ ను సిద్ధం చేశారు. ఆ మేరకు ఛాంబర్లు, ద్వారాల్లో మార్పులు చేసేలా పనులను ప్రారంభించారు.

గాంధీభవన్ కు దక్షిణం వైపు ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది. ఇకమీదట తూర్పు నుంచి నేతలు లోపలికి వచ్చి దక్షిణం వైపు నుంచి బయటకు వెళ్లేలా రెండు ప్రధాన ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు వైపున ఉన్న పార్టీ సామగ్రి అమ్మే గది, సెక్యూరిటీ రూమ్ ను తొలగించనున్నారు.

ఇక ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుని ఛాంబర్ ను కూడా పడమరం వైపు నుంచి తూర్పు వైపుకు మార్చేలా పనులు మొదలు పెట్టారు. పడమరం వైపుకు వరుసగా వర్కింగ్ ప్రెసిడెంట్ లకు గదులు కేటాయించను న్నారు. ప్రస్తుతం ఉన్న అడ్మినిస్ట్రేషన్ గది స్థానంలో కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక గాంధీభవన్, ప్రకాశం హాల్ కు రంగులు వేసి విద్యుత్ దీపాలతో అలంకరించాలని డిసైడ్ అయ్యారు. భవన్ ఆవరణలో ల్యాండ్ స్కెపింగ్ చేయనున్నారు. రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టేనాటికి వారం రోజుల్లో పనులు పూర్తి చేయనున్నారు.

Also Read: సోనూసూద్‌ టెస్ట్ డ్రైవ్ చేసిన ఖరీదైన రేంజ్‌ రోవర్‌ ను కొనుగోలు చేసిన పవన్ కళ్యాణ్.. సోషల్ మీడియాలో వైరల్