AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇద్దరి సెక్యురిటీపై అంత రగడ దేనికి?

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా రాయలసీమలో ఇద్దరు మహిళా నేతల సెక్యురిటీపై ఇపుడు రగడ రాజుకుంది. వీరిలో మొదటి వారు కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డకు చెందిన టిడిపి నేత భూమా అఖిలప్రియ అయితే.. రెండో వారు అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన పరిటాల సునీత. వీరిద్దరు తమకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే.. ఇందులో వాస్తవమెంత ? అనేదిప్పుడు సీమవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రి, అనంతపురం జిల్లా టీడీపీ నేత పరిటాల సునీత […]

ఆ ఇద్దరి సెక్యురిటీపై అంత రగడ దేనికి?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 24, 2019 | 4:10 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా రాయలసీమలో ఇద్దరు మహిళా నేతల సెక్యురిటీపై ఇపుడు రగడ రాజుకుంది. వీరిలో మొదటి వారు కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డకు చెందిన టిడిపి నేత భూమా అఖిలప్రియ అయితే.. రెండో వారు అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన పరిటాల సునీత. వీరిద్దరు తమకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే.. ఇందులో వాస్తవమెంత ? అనేదిప్పుడు సీమవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

మాజీ మంత్రి, అనంతపురం జిల్లా టీడీపీ నేత పరిటాల సునీత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ సర్కార్ తనకు వ్యక్తిగత భద్రతను తగ్గించిందంటూ.. బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తనకు 2+2 గన్‌మెన్ల భద్రత ఉండేదని.. ఇప్పుడు ఆ సెక్యూరిటీని 1+1కు తగ్గించారని పిటిషన్‌లో పరిటాల సునీత ఆరోపించారు. తన కుటుంబ పరిస్థితి, బ్యాక్‌గ్రౌండ్ చూసి 2+2 భద్రతను కొనసాగించాలని పరిటాల సునీత తన పిటిషన్‌లో కోరారు.

పరిటాల సునీత దాఖలు చేసిన ఈ పిటిషన్‌ త్వరలోనే విచారణకు రానుంది. మరి భద్రతకు సంబంధించిన వ్యవహారం, కోర్టులో దాఖలైన పిటిషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది.. కోర్టుకు ఎలాంటి వివరణ ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపైనా హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. మళ్లీ ఇప్పుడు పరిటాల సునీత తన సెక్యూరిటీపై పిటిషన్ వేశారు.

మరోవైపు కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సెక్యూరిటీ విషయంలోను రగడ కొనసాగుతోంది. నిజానికి తనకు సెక్యురిటీ వద్దని మంత్రిగా వున్నప్పుడే అఖిలప్రియ సిబ్బందిని ఎస్పీకి సరెండర్ చేశారు. తాను మంత్రిగా వున్నప్పుడే తన అనుచరల ఇళ్ళపై కార్డన్ సెర్చ్ చేస్తు.. వారిపై పిడి యాక్టు కింద కేసులు నమోదు చేస్తుంటే అందుకు నిరసన వ్యక్తం చేస్తూ తన వ్యక్తిగత సెక్యురిటీని అమె అప్పట్లో సరెండర్ చేశారు.

ఇటీవల ప్రభుత్వం మారిన నేపథ్యంలో తనకు రక్షణ వుండాలని భావిస్తున్న అఖిలప్రియ నేరుగా సెక్యురిటీ కల్పించాలని అడగలేకపోతున్నారు. గతంలో తానే తిరస్కరించిన సెక్యురిటీనిమ్మని ఇపుడెలా అడగడం అన్న కోణంలో ఎస్పీపై పరోక్ష ఒత్తిడి తెచ్చేందుకు అఖిలప్రియ ప్రయత్నించారు. తన ప్రాణాలకు ముప్పుందన్నట్లుగా కామెంట్ చేస్తూ.. పరోక్షంగా రక్షణ కల్పించాలని ఎస్పీ ఫకీరప్పపై ఒత్తిడి పెంచారు. తనపైనా, తన భర్త భార్గవ రామ్ పైనా తప్పుడు కేసులు పెడుతున్నారని ఎస్పీని టార్గెట్ చేశారు అఖిలప్రియ. దానికి ప్రతిగా ఎస్పీ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి.. పోలీసుల అధికారాలేంటో గుర్తు చేసే ప్రయత్నం చేశారు.

మొత్తానికి రాయలసీమకు చెందిన ఇద్దరు టిడిపి మహిళా నేతల రక్షణ వ్యవహారం ఇపుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు నేతలు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తదుపరి చర్యలెలా వుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.