కేంద్రం చేతిలో ఈసీ కీలుబొమ్మ: సీ.ఎం రమేష్

పోలీసుల తనిఖీలపై స్పందించారు సీ.ఎం రమేష్. ఈ తనిఖీలపై మీడియాతో మాట్లాడుతూ.. మా ఇంట్లో గంటపాటు పోలీసులు సోదాలు చేశారు. తనిఖీలు చేసి వెళ్లిపోతుంటే.. మీడియా వచ్చేదాకా ఉండాలని కోరా అని అన్నారు సీ.ఎం రమేష్. మా అనుచరుల ఇళ్లల్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం కీలు బొమ్మగా మారిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఏపీలో టీడీపీకి ఉన్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేకనే కుట్రలు పన్నుతున్నారు. కేవలం టీడీపీ నేతలను ఎన్నికల ప్రచారంలో […]

కేంద్రం చేతిలో ఈసీ కీలుబొమ్మ: సీ.ఎం రమేష్

Edited By:

Updated on: Apr 05, 2019 | 2:34 PM

పోలీసుల తనిఖీలపై స్పందించారు సీ.ఎం రమేష్. ఈ తనిఖీలపై మీడియాతో మాట్లాడుతూ.. మా ఇంట్లో గంటపాటు పోలీసులు సోదాలు చేశారు. తనిఖీలు చేసి వెళ్లిపోతుంటే.. మీడియా వచ్చేదాకా ఉండాలని కోరా అని అన్నారు సీ.ఎం రమేష్. మా అనుచరుల ఇళ్లల్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. కేంద్రం చేతిలో ఎన్నికల సంఘం కీలు బొమ్మగా మారిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఏపీలో టీడీపీకి ఉన్న ప్రజాస్పందనను చూసి ఓర్వలేకనే కుట్రలు పన్నుతున్నారు. కేవలం టీడీపీ నేతలను ఎన్నికల ప్రచారంలో ఇబ్బంది పెట్టాలనే దాడులు చేస్తున్నారు. ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదు. వైసీపీ నేతలు లోటస్‌పాండ్‌లో కూర్చొని కుట్రలు చేస్తున్నారని సీ.ఎం రమేష్ విమర్శించారు. వైసీపీ కార్యకర్తలే తెలుగుదేశం జెండాలు పట్టుకుని అల్లర్లు చేయాలని కుట్రలు చేస్తున్నారు. నిజాయితీగా ఎన్నికలు జరిగితే ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలుస్తోంది. సెర్చ్ వారెంట్ కూడా లేకుండా అసలు ఎలా దాడులు చేస్తున్నారని సీ.ఎం రమేష్ ప్రశ్నించారు.