తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి కరోనా పాజిటివ్!
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు.
Tandur MLA Pilot Rohit Reddy: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. సామాన్య జనం.. ఉద్యోగులు.. ప్రజాప్రతినిధులు.. రాజకీయ నాయకులు.. ఎవ్వరూ కరోనాకు అతీతులు కారు. అందరిపై దాడి చేస్తోంది. హోం మంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు, మంత్రి మల్లారెడ్డికి కరోనా సోకిన విషయం విదితమే.
ఈ క్రమంలో తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. రోహిత్‌ను కుటుంబ సభ్యులు నగరంలోని అపోలో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. కార్యకర్తలు, అనుచరులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. త్వరలోనే కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా.. గతవారం రోజులుగా ఆయన్ను కలిసిన కార్యకర్తలు, నేతలు, బంధువులు కరోనా టెస్ట్‌లు చేయించుకోవడం లేదా హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యాధికారులు చెబుతున్నారు.
Read More:
30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు.. తొలి దశలో 15 లక్షల ఇళ్లు..!
ఆదుకున్న రబీ దిగుబడి.. రాష్ట్రానికి తప్పిన ఆహార ఇబ్బందులు..!