AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉధృతంగా పెరుగుతోన్న కోవిడ్ కేసులు

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,98,06,830కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 7,29,594 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 63,53,992 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,27,23,244 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్..

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉధృతంగా పెరుగుతోన్న కోవిడ్ కేసులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 09, 2020 | 11:01 AM

Share

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజూ కొత్త‌గా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ప‌లువురు సినీ, క్రీడా, రాజ‌కీయ‌ ప్ర‌ముఖులు కూడా ఈ వైర‌స్ బారిన ప‌డుతోన్న‌ విష‌యం తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,98,06,830కి చేరింది. ఇక అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 7,29,594 మంది క‌రోనాతో మ‌ర‌ణించారు. ఇక‌ ప్రస్తుతం 63,53,992 యాక్టీవ్ కేసులు ఉండగా, 1,27,23,244 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్ర‌స్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 51,49,723కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 1,65,070 మంది మృతి చెందారు. కాగా 23,46,183 యాక్టీవ్ కేసులు ఉండగా, 26,38,470 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.

అలాగే భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. క‌రోనా కేసుల్లో ప్ర‌పంచంలో 3వ స్థానానికి చేరింది ఇండియా. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 64,399 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21,53,010కి చేరింది. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6,28,747 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకుని 14,80,884 మంది ఆస్ప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 861 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కోవిడ్ మ‌హ‌మ్మారి బారిన‌పడి 43,379 మంది మరణించారు.

Read More:

ప్రిన్స్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ః ‘స‌ర్కారు వారి పాట’ మోష‌న్ పోస్ట‌ర్ అదిరింది

Follow Us
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రద్దు..? ఐపీఎల్‌ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
ఉదయం లేవగానే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
LG స్మార్ట్ టీవీలు మన మాటల్ని రికార్డ్ చేస్తున్నాయా? నిజమెంత?
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
వేళ్ల మధ్య ఖాళీ ఉందా? మీ వ్యక్తిత్వం, ఆర్థిక పరిస్థితి ఇలా..
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
గూగుల్ మ్యాప్స్‌కు ట్రాఫిక్ ఎలా తెలుస్తుంది? GPS ఎలా పనిచేస్తుంది
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
ఇల్లు కడుతున్నారా? పిల్లర్ సైజు ఎంత ఉండాలో తెలుసుకోండి.. పొరపాటున
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
బుద్ధుని తలపై ఉన్నది జుట్టు అనుకుంటున్నారా.. 108 నత్తల త్యాగం..
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
8 జట్లతో హెచ్‌సీఏ మహిళల అండర్-19 టీ20 టోర్నీకి రంగం సిద్ధం..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
Numerology: ఈ తేదీల్లో పుట్టన వారు నిజాయితీకి కేరాఫ్..!
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..
WPL 2027: జనవరి 14 నుంచి డబ్ల్యూపీఎల్ సమరం..