AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం: 11 నెమళ్లకు విషం పెట్టి చంపిన  రైతు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.?

స్వార్ధం కోసం 11 నెమళ్లకు విషం పెట్టి చంపాడు ఓ రైతు. ఎందుకు అని ఆరా తీస్తే.. తన పంటపొలాన్ని రక్షించుకోవడం కోసం ఇలా చేశానని చెప్పుకొచ్చాడు.

దారుణం: 11 నెమళ్లకు విషం పెట్టి చంపిన  రైతు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు.?
Ravi Kiran
|

Updated on: Jun 11, 2020 | 9:35 AM

Share

ఒకవైపు యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తుంటే.. మరోవైపు మనుషుల్లో మానవత్వం చచ్చిపోయి.. క్రూరత్వం పెరిగిపోతోంది. ఏనుగులు, కుక్కలు, కోతులు.. ఇలా అన్నింటిని అతి దారుణంగా చంపుతున్నారు. క్రూర మృగాలు కూడా మనుషులను చంపనంత కిరాతకంగా ఏ పాపం తెలియని ఈ మూగ జీవాలను తినే పదార్ధాలలో బాంబులు, టపాసులు పెట్టి మరీ వాటి ప్రాణాలను తీస్తున్నారు. ఇక తాజాగా తన స్వార్ధం కోసం 11 నెమళ్లకు విషం పెట్టి చంపాడు ఓ రైతు. ఎందుకు అని ఆరా తీస్తే.. తన పంటపొలాన్ని రక్షించుకోవడం కోసం ఇలా చేశానని చెప్పుకొచ్చాడు.

వివరాల్లోకి వెళ్తే.. తిరుపూర్ జిల్లా తారాపురం సమీపంలోని పుత్తూర్ ప్రాంతంలో రైతులు తమ వ్యవసాయ పొలంలో కూరగాయలు, పండ్లు సాగు చేస్తుంటారు. అయితే ఆ పక్కనే ఉన్న సమీప ప్రాంతం నుంచి తరుచుగా నెమళ్లు వచ్చి ఈ పొలాల్ని ధ్వంసం చేస్తుంటాయి. దీనిపై పలువురు రైతులు అటవీశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం ఓ రైతు పొలంలో 11 నెమళ్లు మృతి చెంది ఉండటం గుర్తించిన స్థానిక రైతులు వెంటనే అటవీశాఖ, వ్యవసాయశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టగా.. శామలైప్పాన్ అనే రైతు ఈ ఘాతకానికి ఒడిగిట్టినట్లు తేలింది. తన పంటను రోజూ వచ్చి ఆ నెమళ్లు నాశనం చేస్తుండటంతో.. వాటికి ముడి బియ్యంలో విషం కలిపి పెట్టానని శామలైప్పాన్ నిజాన్ని ఒప్పుకున్నాడు. దీనితో పోలీసులు అతడిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 9, 51 కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.