తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి
వేలూరు: తమిళనాడులోని వేలూరు పరిధి అంబూరు రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కనే ఆగి ఉన్న ట్రక్కుపైకి ఓ కారు దూసుకెళ్లడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం ఏడుగురు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. ఘటనాస్థలంలో దొరికిన ఆధారాల ప్రకారం మృతులంతా మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనం నుంచి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. […]
వేలూరు: తమిళనాడులోని వేలూరు పరిధి అంబూరు రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి పక్కనే ఆగి ఉన్న ట్రక్కుపైకి ఓ కారు దూసుకెళ్లడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు చిన్నారులతో పాటు మొత్తం ఏడుగురు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా తెలుస్తోంది. ఘటనాస్థలంలో దొరికిన ఆధారాల ప్రకారం మృతులంతా మహారాష్ట్రకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన వాహనం నుంచి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.