AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తబ్లీగీల ఓవ‌రాక్ష‌న్… మాంసాహారం కావాలంటూ..ప్లేట్లు విసిరికొట్టి

తబ్లీగీ జమాత్​ సభ్యులు..ఓవ‌రాక్ష‌న్ తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇంత విపత్క‌ర ప‌రిస్థితుల్లో కూడా వారు దురుసు ప్రవర్తనను మార్చుకోవ‌డం లేదు. యూపీ​ కాన్పుర్​లోని రెండు హాస్పిట‌ల్స్ లో మెడిక‌ల్ స్టాఫ్ తో అసభ్యంగా ప్రవర్తించారు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన‌ సుమారు 60 మంది తబ్లీగీలు.. స్థానిక హల్లెట్​ ఆసుపత్రి ఐసోలేషన్​ వార్డులో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మాంసాహారం కావాలంటూ ప్లేట్లు విసిరికొట్టి.. సిబ్బందిపై గొడ‌వ‌కు దిగారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా […]

తబ్లీగీల ఓవ‌రాక్ష‌న్... మాంసాహారం కావాలంటూ..ప్లేట్లు విసిరికొట్టి
Ram Naramaneni
|

Updated on: Apr 27, 2020 | 10:24 AM

Share

తబ్లీగీ జమాత్​ సభ్యులు..ఓవ‌రాక్ష‌న్ తో వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఇంత విపత్క‌ర ప‌రిస్థితుల్లో కూడా వారు దురుసు ప్రవర్తనను మార్చుకోవ‌డం లేదు. యూపీ​ కాన్పుర్​లోని రెండు హాస్పిట‌ల్స్ లో మెడిక‌ల్ స్టాఫ్ తో అసభ్యంగా ప్రవర్తించారు. కోవిడ్-19 పాజిటివ్ అని తేలిన‌ సుమారు 60 మంది తబ్లీగీలు.. స్థానిక హల్లెట్​ ఆసుపత్రి ఐసోలేషన్​ వార్డులో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మాంసాహారం కావాలంటూ ప్లేట్లు విసిరికొట్టి.. సిబ్బందిపై గొడ‌వ‌కు దిగారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు.

‘తబ్లీగీ జమాత్​ సభ్యులు.. భోజనం చేసేందుకు నిరాకరించడమే కాకుండా, మాంసాహారం​ కావాలని గొడ‌వ‌కు దిగారు. వార్డు బాయ్స్​తో అనుచితంగా ప్రవర్తించారు. ప్లేట్లు విసిరికొట్టారు’‌ అని జీఎస్​వీఎం వైద్య కళాశాల ప్రిన్సిపల్​ అండ్​ డీన్ డాక్ట‌ర్ ఆర్తి లాల్​చందని పేర్కొన్నారు. గతంలోనూ తబ్లీగీ సభ్యులు డాక్ట‌ర్ల పట్ల దురుసుగా ప్రవర్తించారు. యూపీ​ నరేలాలో కొందరైతే ఏకంగా క్వారంటైన్​ గదుల ముందు మలవిసర్జన చేయడం వివాదాస్పదమైంది.

కాన్పుర్​లోని కాశీరామ్​ ఆసుపత్రిలోనూ కోవిడ్ బాధితులు రెచ్చిపోయారు. కొందరు​ రోగులు ఆసుపత్రి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ తరుణంలో రెచ్చిపోయిన బాధితులు ఘర్షణకు దిగి.. ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు.

Follow Us
పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన కోహ్లీ
పంజాబ్ ఫీల్డర్‌కు చూపులతో స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన కోహ్లీ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసిన టాలీవుడ్ హీరోయిన్
బంగారం కాదు, వెండి కాదు.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హాట్ మెటల్ ఇదే!
బంగారం కాదు, వెండి కాదు.. ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న హాట్ మెటల్ ఇదే!
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
ఫైబర్, ప్రోటీన్, కాల్షియం.. ఈ ఇడ్లీలు తింటే అదుర్స్ అనాల్సిందే
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
స్కూల్ ఎడ్యుకేషన్‌లో సరికొత్త టెక్నాలజీ.. డిజిటల్ మూల్యాంకనంతో..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఆ హీరో నాకంటే చాలా చిన్నోడు.. అయినా నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు..
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు నిజంగానే అదృష్టాన్ని తీసుకొస్తారా?
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
బరువు తగ్గాలా? బీపీ కంట్రోల్‌లో పెట్టాలా? మందార టీ మీకోసమే!
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
ఎండలో అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!
కోహ్లీ విశ్వరూపం.. సరికొత్త చరిత్ర సృష్టించిన రన్ మెషీన్..!