వెంటనే ఆ దేశం విడిచి వచ్చేయండి : విదేశాంగ శాఖ

ట్రిపోలి : లిబియాలో నెలకొన్న ఘర్షణలతో అక్కడ పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులందరు వెనక్కి రావాలని భారత విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. లిబియాను తక్షణమే వీడాలని బంధుమిత్రులకు చెప్పాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.  రాజధాని ట్రిపోలిలో 500 మందికి పైగా భారతీయులు ఉన్నారని.. ప్రస్తుతం ట్రిపోలి నుంచి విమానాలు తిప్పుతున్నామని.. ఆ తర్వాత అక్కడి నుంచి రప్పించడం కష్టతరమవుతుందని తెలిపారు. కాగా లిబియాలో నెలకొన్న […]

వెంటనే ఆ దేశం విడిచి వచ్చేయండి : విదేశాంగ శాఖ
Follow us

| Edited By:

Updated on: Apr 20, 2019 | 1:29 PM

ట్రిపోలి : లిబియాలో నెలకొన్న ఘర్షణలతో అక్కడ పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులందరు వెనక్కి రావాలని భారత విదేశాంగ శాఖ పిలుపునిచ్చింది. లిబియాను తక్షణమే వీడాలని బంధుమిత్రులకు చెప్పాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.  రాజధాని ట్రిపోలిలో 500 మందికి పైగా భారతీయులు ఉన్నారని.. ప్రస్తుతం ట్రిపోలి నుంచి విమానాలు తిప్పుతున్నామని.. ఆ తర్వాత అక్కడి నుంచి రప్పించడం కష్టతరమవుతుందని తెలిపారు. కాగా లిబియాలో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల సంఖ్యలో గాయపడినట్టు తెలిపింది.