ట్రైలర్ కాదు.. సినిమా చూసి నిర్ణయం చెప్పండి
వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’. కాగా ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న సమయంలో.. ఈసీ ఈ సినిమాను విడుదల చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఇది ఇలా ఉంటే చిత్ర నిర్మాతలు ఈ సినిమా రిలీజ్ విషయంలో సుప్రీమ్ కోర్టును […]
వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’. కాగా ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న సమయంలో.. ఈసీ ఈ సినిమాను విడుదల చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది.
ఇది ఇలా ఉంటే చిత్ర నిర్మాతలు ఈ సినిమా రిలీజ్ విషయంలో సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఈరోజు విచారణ ప్రారంభించింది. కేవలం ట్రైలర్ ను మాత్రమే చూసి సినిమాను ఈసీ నిషేదించిందని.. సినిమా మొత్తం చూసిన తర్వాత ఓటర్లను ప్రభావితం చేస్తుందో లేదో తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలు కోర్టుకు విన్నవించారు.
దీనితో నిర్మాతల నిర్ణయాన్ని ఏకీభవించిన సుప్రీమ్ కోర్టు.. ఎన్నికల సంఘం ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.